ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చిన్నా చితకా పాత్రల్లో నటించారు. ఆ తరవాత ఏకండా హీరోగా అవకాశం రావడంతో తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్ లో బిజీగా మారిపోయాడు. మెగాస్టార్ కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించాడు. అలా ఆయన నటించిన సినిమాల్లో యముడికి మొగుడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా చిరంజీవితో పాటూ ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది.
Advertisement
సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో చిరంజీవి మరియు సుధాకర్ రూమ్ మేట్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి వరకూ విలన్ పాత్రలు చేసిన సుధాకర్ యముడికి మొగుడు సినిమాలో కమెడియన్ గా నటించాడు. తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజంతో సుధాకర్ ప్రేక్షకులను నవ్వించాడు. ఈ సినిమా తరవాత సుధాకర్ టాలీవుడ్ లో స్టార్ కమిడియన్ గా మారిపోయాడు. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాతల్లో సుధాకర్ కూడా ఒకరు.
Advertisement
ఈ సినిమాకు రాజ్ కోటి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతకుముందు చిన్న సినిమాలకు మ్యూజిక్ అందించిన కోటికి కూడా ఈ సినిమానే లైఫ్ ఇచ్చింది. ఈ చిత్రంలో అందం అందోళం,,,వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మో పాటలతో పాటూ ప్రతి పాటా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తరవాత కోటి టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.
ఈ సినిమాతోనే చిరంజీవి మరో ఇద్దరు మిత్రలు నారాయణరావు, హరిప్రసాద్ లకు కూడా లైఫ్ వచ్చింది. ఈ సినిమాకు చిరుతో పాటూ సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు, సుధాకర్ కలిసి డైనమిక్ మూవీమేకర్స్ అనే బ్యానర్ ప్రారంభించి సొంత బ్యానర్ లో యముడికి మొగుడు సినిమాను నిర్మించి లాభాలు అందుకున్నారు.