టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. వైద్య రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. గుండె మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి సైతం చేస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. కంప్యూటర్ విధానంతో ఎన్నో రోగాలకు మందులు కనిపెడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ జలుబుకు మాత్రం మందును కనిపెట్టలేకపోయారు అన్న సంగతి మీకు తెలుసా..? అదేంటి జలుబుకు డాక్టర్లు మందులు ఇస్తారు కదా అనుకుంటున్నారా..? ప్రస్తుతం మార్కెట్ లో జలుబుకు మందులు ఉన్నప్పటికీ అవి కేవలం అలర్జీని తగ్గించేవి మాత్రమే కానీ ఖచ్చితంగా జలుబు కోసమే తయారు చేసిన మందులు కావు.
Advertisement
Advertisement
జలుబుకు వైరస్ లు కారణం అవుతాయి. ముఖ్యంగా జలుబుకు రైనోవైరస్ అనేది కారణం…ఈ వైరస్లో 200 రకాల వైరస్ లు ఉన్నాయి. ఒక్క వైరస్ కు మందును కనిపెట్టడమే చాలా కష్టం అలాంటిది 200 రకాల వైరస్ లకు మందులు కనిపెట్టడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కరోనా విషయంలో చూస్తున్నాం కూడా. కరోనా ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు పూర్తికావాల్సి వస్తుంది. కానీ ఇప్పటి వరకూ కరోనాకు మందులు కనిపెట్టలేదు. ఒక వేరియంట్ కు మందును కనిపెట్టేలోపు మరో వేరియంట్ రెడీగా ఉంటుంది.
జలుబు కూడా వైరస్ వల్లనే వస్తుంది కాబట్టి దానికి మందును కనిపెట్టడానికి గత 70 ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారంగా సాధారణంగా పెద్దవాళ్లకు సంవత్సరానికి రెండు నుండి మూడు సార్లు జలుబు వస్తుంది. అదే విధంగా పిల్లలకు సంవత్సరానికి పది సార్లు జలుబు రావచ్చు. జలుబు చేసినవారికి అందుకు కారణమైన వైరస్ గొంతువద్దే ఉంటుంది. మనవునిలోని రోగనిరోధక శక్తి ఆ వైరస్ తో పోరాడుతుంది. సాధారణంగా తొమ్మిది రోజుల వరకూ జలుబు అలాగే తగ్గకుండా ఉంటుంది.