చాలా మంది యూట్యూబర్ లు వీడియోలు చేస్తుంటారు. కానీ ఎవరూ చేయని వీడియోలు చేయడం..తమ మాటలతో ప్రేక్షకులను ఆకర్షించడం లాంటివి తెలిసినవారే యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు. ఇక ప్రస్తుతం మన తెలుగులో చాలా మంది సక్సెస్ ఫుల్ యూట్యూబర్ లు ఉన్నారు. వారిలో విక్రమాదిత్య కూడా ఒకరు. 190 వీడియోలు చేసిన విక్రమాదిత్యకు 10మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన విక్రమాదిత్య చిన్న తనంలోనే తన తెలివితేటలకు పదును పెట్టి రూ.100 ను రూ.200 చేశాడు.
Advertisement
తన స్కూల్ సీనియర్ లు తక్కువ ధరకు పాత పుస్తకాలు అమ్మడం చూసి తనకు రూ.100 రూపాయలకు అమ్మాలని కోరాడు. అవే పుస్తకాలను తన జూనియర్ లకు అమ్మి ఏడవతరగతిలోనే రూ.200 సంపాదించగలిగాడు. అంతే కాకుండా ఇంటర్ తరవాత అహ్మదాబాద్ యూనివర్సిటిలో ఫార్మసీలో చేరాడు. అక్కడ నచ్చకపోవడంతో హైదరాబాద్ చేరుకున్నాడు.
Advertisement
చదువుకుంటున్న రోజుల్లోనే అమీర్ పేట్ లోని ఓ ఇనిస్టిట్యూట్ లో వేయి పెట్టి చేరాడు. ఆ తరవాత అదే ఇనిస్టిట్యూట్ ను రూ.3వేలకు అద్దెకు తీసుకుని గంటకు వెయ్యి రూపాయలు తీసుకుంటూ క్లాసులు చెప్పాడు. ఆ ఇనిస్టిట్యూట్ లో స్టైడెంట్స్ పెద్ద సంఖ్యలో చేరడంతో తన స్నేహితులతో కలిసి క్లాసులు చెప్పించాడు. ఆ తరవాత ఇనిస్టిట్యూట్ ద్వారా ఏకంగా కోటికి పైగా సంపాదించాడు. ఆ తరవాత ఓ బ్యాంక్ లో ఉద్యోగం సాధించాడు.
బ్యాంకు ఉద్యోగం చేస్తూ ఇనిస్టిట్యూట్ నడపడం కష్టం అవ్వడంతో పూర్తిగా ఉద్యోగానికి పరిమితమై తన స్నేహితుడికి అప్పగించాడు. 2015లో ఆదిత్య యూట్యూబ్ లో ఛానల్ ను ప్రారంభించాడు. సైన్స్, బ్యాంకింగ్, హిస్టరీ లాంటి డిఫరెంట్ వీడియోలతో అతితక్కువ సమయంలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.
ALSO READ : ఇంజెక్షన్ నరాలకు, శరీర అవయవాలకు ఎందుకు చేస్తారో తెలుసా..?