తెలుగు సినిమాలో విక్టరీ వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ అనగానే ఫాన్స్ ఎంతో ఆసక్తిగా చూసే వారు. వీరి కాంబినేషన్ సెట్ చేస్తే నిర్మాతకు కాసుల పంటే అనే వారు. సినిమా పరంగా పక్కన పెడితే వీరి ఇద్దరికీ సినిమా పరిశ్రమలో వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ఉండేది అప్పట్లో. వివాదాల్లోకి వెళ్ళడం గాని, స్టార్ ఇమేజ్ ఉందనే పొగరు చూపించడం గాని వీరి దగ్గర ఏ కోణంలో కూడా కనపడేది కాదు.
Advertisement
ఇక వీరిని దగ్గరగా చూసిన వారు వీరి వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. మాములుగా సినిమా షూటింగ్ సమయంలో స్టార్ నటులు ఎక్కువగా కారవాన్ వాడుతూ ఉంటారు. షాట్ అయిన వెంటనే కారవాన్ లోకి వెళ్లి కూర్చోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అయితే దాన్ని చాలా తక్కువగా వాడుతూ ఉంటారట వెంకటేష్, సౌందర్య. షూటింగ్ సమయంలో వీరిద్దరూ వారి కారవాన్లలో కాకుండా బయటే కూర్చుని ఉంటారట.
Advertisement
అందరితో కలిసే అంటే మిగతా నటులు, దర్శకులు, వగైరా భోజనం చెయ్యటం చేస్తారట. ఎవరు అయినా దగ్గరికెళ్ళినా సరే సౌమ్యంగా మాట్లాడుతూ, ఆటోగ్రాఫ్ ఇచ్చే వారని చెప్తారు. సౌందర్య అయితే దగ్గరికి అభిమాని వెళ్ళినా లేచి నుంచుని మాట్లాడి గౌరవం ఇస్తారట. ఇప్పుడు కొంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ కూడా అభిమానులు వెళ్తే కారవాన్ నుంచి బయటకు కూడా వచ్చే ప్రయత్నం చేయరు. బాడీ గార్డులను పెట్టుకుని హడావుడి చేస్తూ ఉంటారు.