పాకిస్తాన్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం మధ్య ఇంటర్నెట్ సేవలు బంద్ అయినట్టు హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేసారు. నేషనల్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి.
విద్యుత్ అంతరాయం వారి కార్యకలాపాలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. టెలికామ్ ఆపరేటర్లు మొబైల్, ఇంటర్నెట్ సేవలను ఆపివేస్తామని హెచ్చరిస్తున్నారని ఎన్ఐబీటీ ప్రకటించింది. పాక్ దేశ ఆవిర్భావం తరువాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కోవడం ఇదే మొదటి సారి. విద్యుత్ సంక్షోభం మున్ముందు మరింతగా పెరిగే అవకాశముందని ప్రధాని షెహబాబ్ షరీఫ్ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం.
Advertisement
Advertisement
ఎల్ఎన్‌జీ సరఫరా ఇబ్బందికరంగా మారిందని, ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. మరొకవైపు మునుపు ఎన్నడూ లేనివిధంగా జూన్ నెలలో నాలుగేళ్ల తరువాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పాకిస్తాన్ ప్రజలు ఒక్కసారిగా అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాను వినియోగిస్తున్న తరుణంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వారి సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి మరి.
Also Read :
ఒకే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాలకు ఆ ఒక్క హీరోకి మాత్రమే ఉత్తమ నటుడు అవార్డు దక్కలేదు
కొత్తగా పెళ్లి జరిగిన మహిళలు అధికంగా గూగుల్ లో ఏమి సెర్చ్ చేస్తున్నారో తెలుసా..?