Home » కొత్త‌గా పెళ్లి జ‌రిగిన మ‌హిళ‌లు అధికంగా గూగుల్ లో ఏమి సెర్చ్ చేస్తున్నారో తెలుసా..?

కొత్త‌గా పెళ్లి జ‌రిగిన మ‌హిళ‌లు అధికంగా గూగుల్ లో ఏమి సెర్చ్ చేస్తున్నారో తెలుసా..?

by Anji
Ad

నేటి కంప్యూట‌ర్ కాలంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ముఖ్యంగా ఏ స‌మాచారం కావాల‌న్నా గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. సాప్ట్‌వేర్ చాలా ఉన్నా ఎక్కువ శాతం గూగుల్ లోనే సెర్చ్ చేస్తున్నారు. మిగ‌తా వాటి కంటే కూడా గూగుల్ స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని ఇస్తుంది. అందఉకే ఎక్కువ‌గా గూగుల్‌లోనే ప్ర‌పంచాన్ని చూసేస్తున్నారు. పెళ్లైన మ‌హిళ‌లు గూగుల్ లో ఎక్కువ‌గా ఏమి సెర్చ్ చేస్తున్నారో ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. వాటి గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ఆడ‌పిల్ల‌కు పెళ్లి చేసిన త‌రువాత జీవితాంతం భ‌ర్త‌తోనే ఉంటుంది. పెళ్లి గురించి చాలా మంది ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారు. భ‌ర్త‌తో జీవితం ఎలా ఉండ‌బోతుంది. అత్త‌వారింట్లో ఎలా ఉండాలి..? అనే కోణంలో ఎక్కువ‌గా ఆలోచిస్తుంటారు. పెళ్లి జ‌రిగిన త‌రువాత అత్తారింట్లో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి భ‌ర్త, అత్త‌, మామ‌లే ప్ర‌పంచంగా బ‌తుకుతారు. ఈ మేర‌కు కుటుంబ స‌భ్యుల‌తో మంచి పేరు సంపాదించుకోవ‌డానికి మ‌హిళ‌లు చాలా క‌ష్ట‌ప‌డుతుంటారు. పెళ్లి కాక‌ముందు, పెళ్లి త‌రువాత మ‌హిళ‌లు గూగుల్ లో సెర్చ్ చేయడ‌మ‌నేది ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఈ స‌ర్వేలో ఎన్నో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Advertisement


ముఖ్యంగా భ‌ర్త‌కు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని భార్య‌లు కోరుకుంటారు. భ‌ర్త‌కు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాలంటే ఏంచేయాల‌నే విష‌యాల‌ను గూగుల్‌లో ఎక్కువ‌గా వెతుకుతుంటారు. పెళ్లి జ‌రిగిన త‌రువాత భ‌ర్త మ‌న‌స్సు ఎలా గెల‌వాలి, భ‌ర్త‌తో ఎలా న‌డుచుకోవాలి అనే విష‌యాల‌ను భార్య‌లు సెర్చ్ చేస్తున్నార‌ట‌. భ‌ర్త మ‌న‌స్సును ఆక‌ట్టుకోవ‌డానికి ఏం చేయాల‌నే కోణంలో ఎక్కువ‌గా గూగుల్ లో తెలుసుకుంటున్నారు. అత్త‌గారింటికి వెళ్లిన త‌రువాత భ‌ర్త‌తో పాటు వారి కుటుంబ స‌భ్యులు ఎలా ఉంటారు..? వారితో స‌న్నిహితంగా ఎలా ఉండాలి. వారి మ‌న‌సుల‌ను ఎలా గెలుచుకోవాలనే విష‌యాల‌ను మ‌హిళ‌లు తెగ సెర్చ్ చేస్తున్నారు. కుటుంబ స‌భ్యులంద‌రినీ ఆక‌ర్షిస్తూ అంద‌రికీ నచ్చే వంట‌కాలు చేసే మార్గాల‌ను కూడా అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా భ‌ర్త‌కు ఎక్కువ‌గా ఏది అంటే ఇష్ట‌మో దాని గురించి ఎక్కువ‌గా సెర్చ్ చేసేస్తున్నారు.

Also Read : 

వివాహం కావడం లేదా..? ఈ “మంత్రం” చదివితే చాలు..!

ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటో తెలుసా..?

 

Visitors Are Also Reading