Home » స్కూల్ పిల్లలకు ఉదయాన్నే పాలు ఇవ్వకుండా.. ఈ డ్రింక్ తాగిస్తే చాలా బెనిఫిట్స్..!!

స్కూల్ పిల్లలకు ఉదయాన్నే పాలు ఇవ్వకుండా.. ఈ డ్రింక్ తాగిస్తే చాలా బెనిఫిట్స్..!!

by Sravanthi
Ad

చాలామంది తల్లులు ఉదయం పూట లేవగానే పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి. ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వాలి. వారి స్కూల్ కి బాక్స్ లో ఏ ఆహారం వండాలి అనే విషయం పై ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు.. ఒక్కోసారి వండిన ఆహారాన్ని స్కూల్లో పిల్లలు తినకుండా వెనక్కి తీసుకుని వస్తూ ఉంటారు. తరచూ ఓకే విధమైన ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు ఆహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చాలామంది తల్లులు పిల్లలకు పాలు తాగిస్తారు..

Advertisement

అయితే ప్రస్తుతం ఈ పాల కంటే పిల్లలకు మరో డ్రింక్ ఇస్తే చాలా బాగుంటుంది అని,అధిక శక్తిని ఇస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో దాన్ని ఎలా తయారు చేస్తారో.. ఓ సారి తెలుసుకుందాం..
ముందుగా ఒక గిన్నెలో ఒక పదిహేను ఎండు ద్రాక్షలు, 15 జీడిపప్పులు, పొట్టు తొలగించిన నాలుగు బాదం పప్పు గింజలు, ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు తీసుకుని బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే బ్లెండర్ లో నానబెట్టుకున్న ఎండు ద్రాక్షలు, బాదం పప్పు, జీడి పప్పులను పాలతో సహా వేసుకొని మొత్తం గ్రైండ్ చేయాలి.

Advertisement

చివరి సమయంలో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసుకుంటే చాలా రుచికరమైన ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రింకు సిద్ధం అయినట్టే… స్కూలుకు వెళ్లే పిల్లలకు ఉట్టి పాలు ఇవ్వకుండా ఇలా తయారు చేసిన డ్రింక్ ను తాగించడం వల్ల రోజంతా చాలా హుషారుగా ఉండడమే కాకుండా జ్ఞాపకశక్తి, మెదడు చురుగ్గా పని చేస్తుందని, ఆలోచనాశక్తి రెట్టింపు అవడమే కాకుండా రక్తహీనత సమస్యలు దూరం అవుతాయి. ప్రతి రోజు ఉదయాన్నే పిల్లలతో ఈ డ్రింక్ తాగిస్తే పిల్లల ఎముకలు దృడంగా ఉండడమే కాకుండా, వారి యొక్క రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. పిల్లలు తొందరగా ఎదిగేందుకు ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ALSO READ;

స‌మ‌యం లేద‌ని త్వ‌ర‌త్వ‌ర‌గా తినేస్తున్నారా..? అయితే మీకు ఆ స‌మ‌స్య వ‌చ్చే ప్ర‌మాదం ఉంది జాగ్ర‌త్త‌..!

ఆడ‌వారు రాత్రిపూట త‌ల‌స్నానం చేయ‌వ‌చ్చా..? చేస్తే ఏమవుతుందంటే..?

 

Visitors Are Also Reading