మహిళల ప్రపంచ కప్‌లో ఇవాళ వెస్టిండ్-భారత జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి తొలుత భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టుకు ఓపెనర్లు యాస్తిక బాటియా (31, 21 బంతుల్లో 6*4) స్మృతి మంధాన శుభారంభం చేసారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించాక యాస్తిక పెవిలియన్ చేరింది. కొద్ది సేపటికే కెప్టెన్ మిథాలీరాజ్ (05), దీప్తి శర్మ (15) సైతం వెనుదిరిగారు. అప్పటికే భారత్ 78 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Advertisement
ఈ తరుణంలోనే టీమిండియా బ్యాటర్లు స్మృతి మంధాన (123: 119 బంతుల్లో 13 x 4, 2x 6) హర్మన్ ప్రీత్ కౌర్ (109, 107 బంతుల్లో 10 x 4, 2x 6) సెంచరీలతో కదం తొక్కారు. కష్టాల్లో ఉన్నప్పుడు జోడి కట్టిన స్మృతి, హర్మన్ తొలుత నెమ్మదిగా ఆడారు. క్రీజులో కుదురుకున్న తరువాత రెచ్చిపోయి పరుగులు సాధించారు. ఈ తరుణంలో ఇద్దరూ నాలుగవ వికెట్ కు 184 పరుగుల కీలక భాగస్వామ్యం జోడించారు.
Advertisement
అయితే అప్పటికే శతకం పూర్తి చేసుకున్న స్మృతి ధాటిగా ఆడే తరుణంలో ఔట్ అయింది. తరువాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయినా మరొకవైపు దూకుడుగా ఆడిన హన్మన్ ప్రీత్ సెంచరీ పూర్తి చేసుకున్నది. చివరిలో ఆమె కూడా ఔట్ అయింది. చివరికీ టీమిండియా 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండిస్ బౌలర్లలో అనిసా మహ్మద్ రెండు వికెట్లు తీయగా.. కాన్నెల్, మాథ్యూస్, షకీరా, డాటిన్, ఆలియా తలో వికెట్ పడగొట్టారు.
Also Read : పాకిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య ఉత్కంఠ పోరు.. చివరికి సౌత్ ఆఫ్రికా విజయం