స్టార్ హీరోయిన్ గా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి ఇంద్రజ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగినటువంటి నటి ప్రస్తుతం సహాయక పాత్రలను పోషిస్తుంది. అంతేకాకుండా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ అమ్మడు.
Advertisement
సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే కేరళకు చెందిన ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అతని పేరు మహమ్మద్. ఇంద్రజా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మహమ్మద్ కుటుంబ సభ్యులు కూడా ఇంద్రజను చాలా ప్రేమగా చూసుకుంటారట. ఇక ఇంద్రజ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో మాంసాహారాన్ని అస్సలు తినేదికాదట.
Advertisement
ఇక మహమ్మద్ కుటుంబ సభ్యులు ముస్లింస్ అయినప్పటికీ ఇంద్రజ మీద ఉన్న ప్రేమతో వారు కూడా మాంసాహారాన్ని తినడం మానేశారట. ఇక ఇంట్లో తన కుటుంబ సభ్యులు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటారని, వివాహమైన రోజు నుంచి ఇప్పటివరకు ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండలేదు అని ఇంద్రజ చాలా గర్వంగా చెప్పుకుంటారట. ఇక ఇంట్లో వండడం మానేశారు కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తినడానికి నేను ఎలాంటి కండిషన్స్ పెట్టేదాన్ని కాదు. వారు బయటకు వెళ్ళినప్పుడు మాంసాహారం తినేవారని ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి చెప్పుకొచ్చింది.