ప్రేక్షకులు చూసి ప్రశంసించిన సినిమాలు చాలా ఉంటాయి. కానీ దేశంలో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు గొప్పవారు ప్రశంసించే సినిమాలు చాలా తక్కువ ఉంటారు. రాజమూళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం పై మన ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురింపించారు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి అమిత్ షా ప్రశంసలు కురిపించడమే కాకుండా ఎన్టీఆర్ తో భేటీ అయ్యి మరీ అభినందించారు.
Advertisement
ఇదిలా ఉంటే అప్పట్లోనే అన్నగారు ఎన్టీరామారావు నటించిన ఓ సినిమాపై దేశ రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. తన నటనకు గానూ జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్నారు. జానపద,పౌరాణిక, ప్రేమకథా చిత్రాలు ఇలా సినిమాలు ఏవైనా తనదైన నటనతో మెప్పించారు.
Advertisement
ఇక ఎన్టీఆర్ కూడా ఒకప్పుడు భారత రాష్ట్రపతిని తన సినిమాతో ఫిదా చేశారు. తెలుగువారు అయిన నీలం సంజీవరెడ్డి 1977 కాలంలో రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన ఏపీలో అనేక పదవులలో పనిచేసి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నీలం సంజీవరెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ తెలుగు సినిమాలు చూసేవారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలు అంటే చాలా ఇష్టపడేవారు. తెలుగు రాష్ట్రం గురించి సమస్య గురించి ఎక్కువగా మాట్లాడేవారు. ఇక ఏపీకి వచ్చిన సమయంలో ఓసారి సంజీవరెడ్డి ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపరాయుడు సినిమాను స్పెషల్ షో వేసుకుని వీక్షించారు. అంతే కాకుండా సినిమా చాలా బాగుందని బ్రిటిష్ వారి అక్రమాలను చూపిస్తూ పోరాటం చేసిన ఎన్టీఆర్ నటన చాలా బాగుందని ఓ ప్రశంసా పత్రాన్ని రాసి వెళ్లారు. ఇప్పటికీ ఆయన రాసిన నోట్ రామకృష్ణ థియేటర్లో ఉందట.