ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ లో దాయాధి దేశాన్ని మన జట్టు చిత్తుగా ఓడించింది. అయితే ఇలా ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అభిమానులకు చాలా ఉత్సహం అనేది వస్తుంది. ఇందులో ఎలాగైనా మన జట్టే గెలవాలని రెండు దేశాల ఫ్యాన్స్ అనుకుంటారు. అయితే ఈ రెండు దేశాల మధ్య కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఈరోజు మ్యాచ్ జరిగింది. మహిళా జట్లు పోటీపడిన ఈ మ్యాచ్ లో మన అమ్మాయిలు దాయాదులు చిత్తుగా ఓడించారు.
Advertisement
అయితే ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది పాకిస్థాన్. కానీ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు కుప్పకూలిపోయింది. 18 ఓవర్లలోనే 99 పరుగులు చేసి పాకిస్థాన్ ఆల్ అవుట్ అయ్యింది. ఇక ఆ తర్వాత 100 పరుగుల లక్ష్యంతో వచ్చిన టీం ఇండియా కేవలం రెండు వికెట్లు కోల్పోయి 11.4 ఓవర్లలోనే విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ను వర్షం కారణంగా 18 ఓవర్లకే భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుదించారు. అయినా కూడా భారత జట్టు ఓపెనర్ స్మృతి మందన 63 పరుగులతో రాణించడంతో మనం విజయం సాధించాం.
Advertisement
ఇక ఈ కామన్వెల్త్ గేమ్స్ 2022లో గ్రూప్ ఏ లో ఉన్న భారత జట్టు ఈ విజయంతో మొదటి స్థానానికి వెళ్ళింది. ఆడిన రెండు మ్యాచ్ లలో ఒక్క విజయం సాధించింది భారత జట్టు. ఇక పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ లలో రెండు ఓడిపోయి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. అందువల్ల ఈ జట్టు సెమీస్ కు వచ్చే అవకాశాన్ని కోల్పోయింది. ఇక టీం ఇండియా తర్వాత తర్వాతి మ్యాచ్ లో విజయం సాధిస్తే.. సెమీస్ కు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. చూడాలి మరి ఆగస్టు 3న జరిగే ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధిస్తుందా.. లేదా అనేది.
ఇవి కూడా చదవండి :