ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ అనేది చాలా ఉత్కంఠంగా మారింది. సూపర్ 12 లో ఉన్న 12 జట్లకు ఇంకా ఒక్కో మ్యాచ్ మాత్రమే ఉంది. అయిన ఇంకా ఒక్క జట్టు కూడా అఫీషియల్ గా సెమీస్ కు క్వాలిఫై కాలేదు. ఇక మన ఇండియా ఉన్న బి గ్రూప్ లో కూడా సెమీస్ రేస్ అనేది చాలా ఉత్కంఠంగా మారింది.
Advertisement
ప్రస్తుతం 6 పాయింట్లతో ఇండియా టాప్ లో ఉండగా… 5 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా, 4 పాయింట్లతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. అయితే ఈరోజు సఫారీల పై పాక్ విజయం సాధించడంతో ఇండియాకు జింబాబ్వేతో ఉన్న ఆఖరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకంటే మన కంటే క్కిందా ఉన్న సౌత్ ఆఫ్రికాకు నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో సఫారీలు తప్పకుండ గెలుస్తారు.
Advertisement
ఇక 4 పాయింట్లతో ఉన్న పాక్, బంగ్లా జట్ల మధ్యే మ్యాచ్ ఉండటంతో ఏదో ఒక్క జట్టు గెలిచి 6 పాయింట్లు సాధిస్తుంది. కాబట్టి ఇండియా గెలిస్తే తప్పకుండ సెమీస్ వెళ్తుంది. లేదంటే రన్ రేట్ లెక్కలోకి వస్తుంది. కాబట్టి మన కంటే పాక్ రన్ రేట్ అనేది బాగుంది. కాబట్టి మనం మన మ్యాచ్ లో ఒడి.. పాక్ తన మ్యాచ్ లో గెలిస్తే ఆ జట్టే సెమీస్ వెళ్లడం పక్క.
ఇవి కూడా చదవండి :