Home » పెద్ద షాక్.. కోహ్లీని పొగిడిన గంభీర్..!

పెద్ద షాక్.. కోహ్లీని పొగిడిన గంభీర్..!

by Azhar
Ad

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ కప్ లో మ్బచి ఫామ్ లో ఉన్నాడు. అయితే ఈ ప్రపంచ కప్ తో పాటుగా మొత్తం అన్ని ప్రపంచ కప్ టోర్నీలు కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ఉన్నాడు. అయితే కోహ్లీ ఎలా ఆడిన కూడా అతడిని విమర్శించేవారిలో గౌతమ్ గంభీర్ ముందుంటాడు. కానీ అందరికి షాక్ ఇస్తూ… ఈరోజు గంభీర్ కోహ్లీని పొగిడాడు.

Advertisement

అయితే ఈరోజు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ 64 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర అనేది పోషించాడు. ఇక కోహ్లీ యొక్క ఈ ఇన్నింగ్స్ గురించి గంభీర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఈ తరంలోనే గొప్ప ఆటగాడు. అతడిలా యాంకర్ రోల్ అనేది పోషిస్తూ భాగసామ్యాలు నెలకొల్పడం ఎవరి వల్ల కాదు. ఈ తరంలో గొప్ప ఆటగాళ్లు అని పిలవబడే ఎవరిలో కూడా కోహ్లీలో ఉన్న ఈ గుణం లేదు.

Advertisement

విరాట్ కోహ్లీ మొదట యాంకర్ రోల్ పోషిస్తూ ఉంటాడు. ఆ తర్వాత చివర్లో అతను లైన్ లోకి వచ్చి పరుగులు చేస్తాడు. ఈరోజు అతను ఆదే విధంగా ఆడాడు. కేఎల్ రాహుల్ ఔట్ అయిన తర్వాత.. వచ్చిన సూర్య కుమార్ కే అతను బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు. అలానే చివరి వరకు క్రీజులో చూస్తూ ఉండి ఆఖర్లో తన బ్యాట్ కు పై చెప్పాడు అని గంభీర్ కోహ్లీని ప్రశంసించాడు.

ఇవి కూడా చదవండి :

విదేశీ లీగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైనా..!

విరాట్ రికార్డులు.. డబుల్ సెంచరీకి ఒక్క అడుగు దూరంలో..!

Visitors Are Also Reading