Home » ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరు..? మన హీరోలు ఏ స్థానాల్లో ఉన్నారంటే..?

ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరు..? మన హీరోలు ఏ స్థానాల్లో ఉన్నారంటే..?

by Sravanthi
Ad

చాలా తెలుగు సినిమాలు సూపర్ హిట్లవుతున్నాయి. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీ రేంజ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరో మీకు తెలుసా..? ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రజాదారణ పొందిన స్టార్ జాబితాని ప్రముఖ మీడియా సంస్థ కన్సల్టింగ్ సంస్థ ఓర్ మార్క్స్ మీడియా నవంబర్ 2024 సర్వే రిపోర్ట్ ని తీసుకొచ్చింది. ఈ లిస్టు ప్రకారం ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరు అనేది తెలుస్తోంది. చాలామంది మూవీ నచ్చితే చాలు అసలు భాష ఏదైనా సరే చూసేస్తారు. ఒకప్పుడు దక్షిణాది హీరోలకి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో చోటు దక్కేదే కాదు. మార్కెట్ కూడా ఉండేది కాదు.

Here's why 'Salaar' star Prabhas failed to cast his vote

Advertisement

గత దశాబ్ద కాలం నుంచి పరిస్థితులు మారాయి. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దేవర సినిమాకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓర్ మార్క్స్ మీడియా సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఇద్దరు బాలీవుడ్ హీరోలకి మాత్రమే చోటు దక్కింది.

Advertisement

Also read:

ఈ జాబితా ప్రకారం చూస్తే ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోగా మొదటి స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ పాపులారిటీ క్రమంగా పెరుగుతోంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో సక్సెస్ ని అందుకున్నారు. కల్కి తో కూడా మంచి హిట్ అందుకున్నారు. రెండవ స్థానంలో విజయ్, మూడవ స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారు నాలుగవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అజిత్ ఐదవ స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ ఆరవ స్థానంలో, ఏడవ స్థానంలో మహేష్ బాబు, ఎనిమిదవ స్థానంలో సూర్య, తొమ్మిదవ స్థానంలో రామ్ చరణ్ పదవ స్థానంలో సల్మాన్ ఖాన్ ఉన్నారు.

Visitors Are Also Reading