దేశంలో కరోనా వైరస్ ఉదృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఈ రోజు దేశంలో 25,920 కొత్త కేసులు నమోదయ్యాయి. 472 మంది కరోనాతో మృతిచెందారు. అంతే కాకుండా 66,254 మంది కరోనా నుంచి తిరిగి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 22,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటికే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను ఎత్తి వేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలు కూడా కరోనా ఆంక్షలను సడలించాయి. గురువారం గోవా రాష్ట్రం లో విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా గుజరాత్ లో కూడా విద్యాసంస్థలను తిరిగి ఫిబ్రవరి 21 నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ ఆఫ్లైన్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటి వరకు మొత్తం 17449 కోట్ల ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను వేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గా దేశంలో మొత్తం 33 లక్షల కు మించి వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందజేశారు. మరోవైపు దేశంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేసి ప్రస్తుతం మూడో డోసు వ్యాక్సిన్ లను సైతం ఇస్తున్న సంగతి తెలిసిందే. 60ఏళ్ల పైబడిన వారికి ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోస్ వ్యాక్సిన్ లను ఇవ్వడం ప్రారంభించారు.