భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్వహిస్తోంది. ఈ వంతెనను ఇండియా మణిపూర్ లో నిర్మిస్తోంది. 141 మీటర్ల ఎత్తులో ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రస్తుతం ఉన్న యూరప్ లోని మోంటెనెగ్రోల్ లోని మాలా- రిజెకా వయడక్ట్ లో ఉన్న 139 మీటర్ల వంతెన రికార్డును బ్రేక్ చేసేదిగా ఉంటుంది. ఇదిలా ఉండగా మణిపూర్ లో నిర్మిస్తున్న వంతెన బ్రాడ్ గేజ్ నెట్వర్క్ తో నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 2 నుంచి 2.5 గంటల్లోనే 111 కిలోమీటర్ల దూరం చేరుకోవచ్చు. ఈ వంతెన నిర్మాణాన్ని 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Advertisement
ఇక 12 కిలోమీటర్ల వరకు విస్తరించే మొదటి దశ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండో దశలో 90 శాతం పనులను పూర్తి చేయనున్నారు. ఇక ఈ వంతెన పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తయిన మంతెన మనదేశంలోనే ఉండనుంది. అంతే కాకుండా ఈ వంతెనను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. 723 మీటర్ల పొడవు లో తొమ్మిది సపోర్టింగ్ పిల్లర్లను ఈ వంతెన కోసం నిర్మిస్తున్నారు. వీటి తయారీలో 11780 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. జిరిబామ్ ఇంఫాల్ లో 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో నోని జిల్లాలో నిర్మిస్తున్న ఈ వంతెన ఎత్తు 141 మీటర్లు గా ఉంటుంది.
Advertisement