కామంవెళ్తా గేమ్స్ 2022 లో మహిళల క్రికెట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఇప్పుఫు భారత జట్టు బంగారు పోరులోకి ఎంట్రీ ఇచ్చింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ లలో పాకిస్థాన్, బార్బిడోస్ పై విజయాలు సాధించి సెమీస్ కు వచ్చిన టీం ఇండియా.. ఈ రోజు సెమీస్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి ఫైనల్స్ లోకి వెళ్ళింది.
Advertisement
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత ఓపెనర్ స్మృతి మందాన అద్భుతమైన అర్బన్ ఇచ్చింది. కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకం చేసి 32 బంతుల్లో 61 పరుగులు చేసి ఔట్ అయ్యింది. ఇక ఆ తర్వాత రోడ్రిగ్స్ 44 పరుగులు చేయగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ 20, 22 పరుగులు చేయడంతో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది భారత్.
Advertisement
ఇక ఆ తర్వాత 165 పరుగుల లక్ష్యంలో వచ్చిన ఇంగ్లాండ్ కు కుఫా శుభారంభం లభించింది. అలాగే ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాగా ఆడటంతో విజయం వారివైపు వెళ్ళింది. కానీ చివరి 5 ఓవర్లలో భారత బౌలర్లు ఇంగ్లాండ్ ను కట్టడి చేయడంతో.. ఇంగ్లాండ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. దాంతో భారత జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది.
ఇవి కూడా చదవండి :