Home » స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అమెరికాను వెన‌క్కినెట్టిన భారత్..!

స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అమెరికాను వెన‌క్కినెట్టిన భారత్..!

by AJAY
Ad

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడ‌ని వారు అంటూ ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇంట్లో 4,5 స్మార్ట్ఫోన్లు ఖచ్చితంగా ఉంటున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన కరోనా లాక్ డౌన్ తో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా పెరిగిపోయింది. స్కూల్ పిల్లలకు సైతం స్మార్ట్ ఫోన్ లు కొని ఇవ్వాల్సిన‌ పరిస్థితి వచ్చింది.

Advertisement

ఆన్లైన్ క్లాసుల కోసం స్కూల్ పిల్లలకు కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనడం జరిగింది. ఇదిలా ఉంటే భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా రెండో స్థానంలో నిలిచింది. ఇండియాలో కి చైనా స్మార్ట్ ఫోన్ రాకతో తక్కువ ధరకు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement

తక్కువ ధరకే ఎక్కువ ఫీచ‌ర్లు ఉన్న‌ స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి రావడంతో యూజర్ లు కూడా ఎగబడి కొనేస్తున్నారు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న అమెరికాను సైతం భారత్ వెనక్కి నెట్టేసింది. ఇక చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో ప్రపంచంలోనే నెంబర్ వ‌న్ ర్యాంకు లో నిలిచింది. ఆ త‌ర‌వాత‌ భారత్ రెండో స్థానంలో ఉండ‌గా ఆ తర్వాత స్థానంలో అమెరికా నిలిచింది.

Visitors Are Also Reading