మరో రెండు వారాల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఐసీసీ కూడా టోర్నీకి సంబంధించి ప్రోమోలు, సాంగ్స్ ను రిలీజ్ చేసి మరింత హీట్ ను పెంచింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు వన్డే ప్రపంచకప్ పైనే పడింది. ఈ సమయంలో ఐసీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నిర్వహించాల్సిన టి20 వరల్డ్ కప్ కోసం అగ్రరాజ్యం అమెరికాలో వేదికలను కూడా ఖరారు చేసింది. 2024 లో జరగబోయే టి20 మెగా టోర్నీలో వెస్టిండీస్ తో పాటు అమెరికా కూడా ఆతిథ్య హక్కులను పొందింది.
అందువల్ల అమెరికాలోని మూడు మైదానాలలో టి20 ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. యూఎస్ లోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో ఈ మ్యాచులు జరగనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇదిలా ఉండగా హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలవబడే ఇండియా – పాక్ మ్యాచ్ ను ప్రేక్షకులు చూడడానికి ఎప్పుడు సిద్ధంగా సిద్ధంగానే ఉంటారు. వచ్చే ఏడాది ఇండియా – పాక్, అమెరికాలో తలపడనున్నాయి. నిజానికి అమెరికాలోని క్రికెట్ ను ఒక గేమ్ లాగా కూడా చూడరు. ఇప్పటివరకు అమెరికాలో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా జరగలేదు.
Advertisement
Advertisement
కాకపోతే ఈ మధ్య అక్కడ ఓ మినీ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీని విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఐసిసి టి20 వరల్డ్ కప్ ను పకడ్బందీగా నిర్వహించి వచ్చే వన్డే వరల్డ్ కప్ సమయానికి అమెరికా నుంచి కూడా ఓ జట్టును సిద్ధం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టి20 వరల్డ్ కప్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో అమెరికా కూడా అంతర్జాతీయ జట్లకు క్రికెట్ డెస్టినేషన్ కానుంది. గతంలో నేపాల్, యూఏఈ, నెదర్లాండ్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఆప్కానిస్తాన్ టీం లో అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేవి కావు. రాను రాను ఆ టీం లు విదేశీ పర్యటన చేసే సత్తా చూపించుకున్నాయి. ఈ జాబితాలో లోకి అమెరికా చేరుతుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
- ప్రపంచ కప్ కోసం టీమిండియా జెర్సీ ఇదే…పెను మార్పులతో !
- Salaar : ప్రభాస్ ‘సలార్’లో త్రిష, ఐశ్వర్య రాయ్.. ఏందయ్యా ఇది!
- Nara Brahmani : చంద్రబాబు అరెస్ట్….పాదయాత్రకు సిద్దమైన బ్రహ్మణి ?