Home » ఈనెల 18న ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ లో మ్యాచ్.. ఈసారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. వివరాలు ఇవే

ఈనెల 18న ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ లో మ్యాచ్.. ఈసారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. వివరాలు ఇవే

by Bunty
Ad

టీ 20 సిరీస్‌ గెలిచిన టీమిండియా వన్డేల్లోనూ శుభారంభం చేసింది. గౌహతి వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా 1-0 ఆదిక్యంలో నిలిచింది. అయితే తాజాగా హైదరాబాద్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ పై hca ప్రెసిడెంట్ అజారుద్దీన్ కామెంట్స్ చేశారు. ఈ నెల 18 న హైదరాబాద్ లో ఇండియా, న్యూజిలాండ్ వన్ డే క్రికెట్ మ్యాచ్ జరగనుందని ప్రకటించారు అజారుద్దీన్.

 

Advertisement

మధ్యాహ్నం 1.30 నుంచి 5 గంటల వరకు ఫస్ట్ ఇన్నింగ్స్ ఉంటుందని,5.45 pm నుంచి 9.15 వరకు రెండవ ఇన్నింగ్స్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆన్లైన్ లో టికెట్స్ ఇస్తామన్నారు. నాలుగు సంవత్సరాల తరవాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరగనుందని…జనవరి 18 మ్యాచ్ కోసం కేవలం ఆన్ లైన్ లో (పెటియం) మాత్రమే…ఆఫ్ లైన్ టికెట్ అమ్మడం లేదని స్పష్టం చేశారు.

Advertisement

 

మ్యాచ్ కి రావడానికి ఫిజికల్ టికెట్ తప్పనిసరి అన్నారు. Lb స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో జనవరి 15 నుండి 18 వరకు ఉదయం 10 నుండి 3 గంటల వరకు ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకోవాలని కోరారు. బ్లాక్ టికెట్ అమ్మకాలు జరగ కుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం…పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఆన్లైన్ టికెట్ లు జనవరి 13 నుండి 16 వరకు విడతల వారీగా అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. స్టేడియం కెపాసిటీ 39,112 అని, కంప్లమెటరి టికెట్స్ 9695 ఉన్నాయని వివరించారు. 29417 టికెట్స్ అమ్మకానికి ఉంటాయని, ఆన్లైన్ టికెట్ తీసుకునేవారు కేవలం 4టికెట్ లు మాత్రమే తీసుకోవాలన్నారు HCA అధ్యక్షులు అజారుద్దిన్.

 

 

Visitors Are Also Reading