Home » మీ పిల్లలలకు చదువుపైన ఆసక్తి పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇవి పాటించండి ..!

మీ పిల్లలలకు చదువుపైన ఆసక్తి పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇవి పాటించండి ..!

by Bunty
Published: Last Updated on
Ad

ప్ర‌స్తుతం పోటీ యుగం న‌డుస్తుంది. పిల్ల‌లు త‌మ చ‌దువులపై దృష్టి పెట్టి ఏకాగ్ర‌తతో చ‌ద‌వ‌క‌పోతే వెనుక‌బ‌డిపోయే ప్ర‌మాదం ఉంటుంది. దీంతో త‌మ పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అన్నీ సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు. అయితే పిల్ల‌ల గ‌దిలో వాస్తు ప్ర‌కారం.. కొన్ని వ‌స్తువులు ఉంచ‌డం అనేక ప్ర‌యోజ‌నాలు ఇస్తుంది. ముఖ్యంగా పిల్ల‌ల గ‌దిలో పెట్టే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ మాన‌సిక ఆనందాన్ని ఇస్తాయ‌ని పేర్కొంటున్నారు.

 

Advertisement

లిల్లి మొక్కను ఇంట్లో పెట్టుకోవడంతో వలన పరిసరాల్లో ప్రశాంతత ఉంటుంది. లిల్లిలను సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. సంరక్షణ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

 

Advertisement

వాస్తు ప్రకారం వెదురు మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటె సానుకూలత పెరుగుతుంది. ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. వెదురు మొక్కను పెంచడం ద్వారా పిల్లల చదువులో ఏకాగ్రత సాధించగలుగుతారు. ఈ వెదురు మొక్క నీడలో కూడా సులభంగా పెరుగుతుంది.

 

మల్లె మొక్కను ఇంటి వెలుపల, లేదా లోపల కూడా పెంచుకోవడం సులభం. మల్లెపువ్వులు వెదజల్లే సువాసన కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కనుక పిల్లల గదిలో మల్లెమొక్కను ఇండోర్ ప్లాంట్ గా పెంచుకోవచ్చు.

ఆర్చిడ్ మొక్కకి ఏడాది పొడవునా పూలు పూస్తాయి. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పువ్వులు మనస్సుకు సంతోషాన్ని ఇస్తాయి. మనసు ఆనందంగా ఉంటే చదువులో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

Visitors Are Also Reading