తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు లోని 16వ మలుపు దగ్గర ఇది జరిగింది. ఇక అసలేం జరిగింది అనేది చూస్తే… ఒక బైక్ అదుపు తప్పి బస్సు ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళుతున్న జ్యోతి తీవ్రంగా గాయపడింది వెంటనే ఆసుపత్రి కి తీసుకెళ్లారు. జ్యోతి ని పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు.
Advertisement
Advertisement
ఆమె వివరాలను చూస్తే మృతురాలు పేరు దాసరి జ్యోతి గుంటూరు జిల్లా మాచర్ల లోని ఎర్రగడ వీధికి చెందిన అమ్మాయి. పోలీసులు ఈ వివరాలను గుర్తించారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించడం జరిగింది. బైక్ అదుపు తప్పి బస్సును ఢీ కొనడం వలన ఇలా జరిగింది. తన భర్త సతీష్ తో పాటుగా కలిసి బండి మీద జ్యోతి వెళుతుండగా ఇది చోటు చేసుకుంది. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు శోక సంద్రం లో మునిగి పోయారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!