సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) 2023 బోర్డు పరీక్షలలో కీలక మార్పులను ప్రకటించింది. యాన్యువల్ ఎగ్జామ్ పద్దతికి మారుతున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. 2022 బ్యాచ్ వారికి మాత్రమే టర్మ్-1, టర్మ్-2 పరీక్షలుంటాయి. కరోనా కారణంగా 2021లో కొన్ని పరీక్షలను నిర్వహించలేకపోయింది.
Advertisement
సీబీఎస్‌కి 2020లో ఏ పరీక్షలు నిర్వహించేందుకు సాధ్యం కాలేదు. ప్రస్తు కరోనా మహమ్మారి తగ్గడంతో రెండు టర్మ్‌ల పరీక్ష విధానాన్ని తొలగించి యాన్యువల్ ఎగ్జామ్ పద్దతి ఫాలో కానున్నది. మరొక వైపు బోర్డు 9వతరగతి నుండి 12వ తరగతి వరకు సిలబస్ లో మార్పులు చేసినది. ఇక అకాడమిక్ సెషన్‌న విభజించడం, రెండు టర్మ్ ఎండ్ పరీక్షలను నిర్వహించడం, సిలబస్‌ను క్రమబద్ధీకరించడం వంటి నిర్ణయాలు కరోనా మహమ్మారిని దృష్టిలో అప్పటి పరిస్థితులను బట్టి తీసుకున్నవి అని సీబీఎస్ఈ తెలిపింది. 2021-22 సంవత్సరంలో 10వతరగతి, 12వతరగతి బోర్డు పరీక్షల కోసం ప్రత్యేక మూల్యాంక స్కీమ్‌ను అమలు చేసింది.
Advertisement
తమ బ్యాచ్ విద్యార్థులు మాత్రమే రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరవ్వడం అన్యాయం అని ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10వ, 12వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టర్మ్-1 పరీక్షలు ముగిసాయి. టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి. ఈ బ్యాచ్ విద్యార్థులకు మాత్రమే రెండు టర్మ్ పరీక్షలుంటాయి. టర్మ్-2 పరీక్షలను రద్దు చేసి టర్మ్-1, ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా తులి ఫలితాలు లెక్కించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు పాఠశాలలను మూసివేయడం వల్ల కలిగే నష్టాల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నా.. మెల్ల మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ పాఠశాలల మూసివేతకు దారి తీస్తుందనే ఆందోళన కనిపిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు పాఠశాలలో విద్యార్థులకు, సిబ్బందికి కరోనా సోకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా తరుగతులను మూసివేశారు.
ఇవి కూడా చదవండి :
Gruhalakshmi ఏప్రిల్ 22 (ఈరోజు) ఎపిసోడ్ : అమ్మ వద్ద నుంచి అత్త దగ్గరికి వెళ్లిన అభి..!
Chanakya Niti : మనిషిని విజయపథంలోకి తీసుకెళ్లే ఐదు సూత్రాలు ఇవే..!