Home » Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

by Bunty
Ad

 

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తన అందంతో కరెంటు తీగ లాంటి నడుముతో యువతకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మ భారీ పాపులారిటీని కూడా దక్కించుకుంది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై మోజు పడి అక్కడికి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యింది.

READ ALSO : ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను… బేబీ బంప్ పై ఉపాసన !

Advertisement

కానీ ఒక నిర్మాత వల్లే ఇలియానా సౌత్ కి దూరం అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇలియానా ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఒక డ్రెస్ ను పోస్ట్ చేసి నా లిటిల్ డార్లింగ్ ను చూసేందుకు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ తన ప్రెగ్నెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ పోస్టుకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వస్తున్నాయి.

Advertisement

read also : “విక్రమార్కుడు” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…!

Ileana D'Cruz announces pregnancy with a sweet post. Fans congratulate the actress - India Today

అలాగే సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్లు కూడా ఇలియానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇలియానా తల్లి సమీరా డిక్రూజ్ ఎమోషనల్ పోస్టు పెట్టింది. కొత్త ప్రపంచంలోకి నా మనవరాలికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ దంపతులు కూడా ఇలియానా, లారెంట్ మైకేల్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా త్వరలోనే ఇలియానా, లారెంట్ మైకేల్ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

read also : సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకులు ఎందుకు తీసుకున్నారు!

Visitors Are Also Reading