Home » రెడ్ హ్యాండెడ్ గా మళ్లీ దొరికిపోయిన ఇలియానా.. అతడేనా తన ప్రియుడు ?

రెడ్ హ్యాండెడ్ గా మళ్లీ దొరికిపోయిన ఇలియానా.. అతడేనా తన ప్రియుడు ?

by Bunty
Ad

తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగినటువంటి నటి ఇలియానా. తన అంద చందాలతో, వయ్యారాలతో యువతను ఊపుఊపేసింది. 2004లో “దేవదాసు” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఇలియానా ఆ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోతూ… తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.

Advertisement

కొద్ది రోజులకు సినిమాలకు పూర్తిగా దూరమైంది ఇలియానా. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా కొన్ని రోజుల క్రితం ఇలియానా పెళ్లి కాకుండానే… ప్రెగ్నెంట్ అంటూ బేబీబంప్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఆ బిడ్డకు తండ్రి ఎవరునే విషయాన్ని మాత్రం షేర్ చేసుకోలేదు. దీంతో నెటిజన్లు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ఆరా తీశారు. కానీ ఆ విషయాలను పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ టైమ్ ని ఎంజాయ్ చేస్తుంది ఇలియానా.

Advertisement

Ileana

Ileana

ప్రస్తుతం 9వ నెలతో ఉన్న ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోను “డేట్ నైట్” అంటూ క్యాప్షన్ ను జత చేసి ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. తన బిడ్డకు తండ్రి అయినటువంటి వ్యక్తి ఫోటోను షేర్ చేసినప్పటికీ… తన పేరును మాత్రం ప్రకటించలేదు. గతంలో కత్రినా కైఫ్ తమ్ముడుతో ఇలియానా డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ఆ ఫోటో కత్రినా కైఫ్ తమ్ముడిది కాకపోవడంతో ఈ కొత్త వ్యక్తి ఎవరని సోషల్ మీడియాలో అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక, మరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇలియానా… తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అయినా తన బాయ్ ఫ్రెండ్ పేరును ప్రకటిస్తుందో లేదో చూడాలి.

Visitors Are Also Reading