మనం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతిలో చాలా పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. వాటితో మనం రకరకాలుగా ప్రయత్నించాలి. ఆ ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఏయే ఆహార పదార్థాలను ఎప్పుడు తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని పదార్థాలను నీటిలో నానబెట్టి తింటే బెటర్. నీటిలో నానబెట్టడం వల్ల కొన్ని పదార్థాలు స్పౌట్స్ గా మారుతాయి. వీటిలో పోషకాలు, ఎనర్జీ వంటివి సంపూర్ణం ఉంటాయి. వీటిని తినడం వల్ల చాలా రకాల వ్యాధుల నుంచి ముప్పు తొలగిపోతుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పెసలు
Advertisement
పెసలులో ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ బీ వంటి న్యూట్రియంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని రాత్రి సమయంలో నానబెట్టి తినడం వల్ల అధిక రక్తపోటు, డయాబెటిస్, కాన్సర్ వంటి వ్యాధులు దూరమవుతాయి.
Also Read : మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ చిట్కా తప్పక పాటించండి..!
కిస్మిస్
కిస్మిస్ లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటివి ఉంటాయి. కిస్మిస్ రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే.. ఎనిమియా, కిడ్నీ స్టోన్స్, ఎసిడిటి వంటి వ్యాధులు కూడా దూరమవుతాయి.
శనగలు
Advertisement
శనగల స్ప్రౌట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుంది. శనగలను స్పౌట్స్ రూపంలో తీసుకుంటే.. మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది. స్టామినా పెంచుతుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది.
అంజీర్
అంజీర్ లో జింక్, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్లు, విటమిన్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. అంజీర్ నానబెట్టి తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గడంలో ఉపయోగపడుతాయి. శరీరంలో రక్త హీనతను పరిష్కరిస్తాయి.
Also Read : మెంతులు చేదుగా ఎందుకు ఉంటాయో తెలుసా..?
బాదం
బాదంలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, యాంటి ఆక్సిడెంట్స్ నిండి ఉండే బాదం నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా లాభం ఉంటుంది. బాదం రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మెదడు పని తీరు మెరుగు అవుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
మెంతులు
మెంతులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నానబెట్టిన మెంతులు తినడం వల్ల స్థూలకాయం, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటివి అదుపులో ఉంటాయి. మెంతులను రోజూ తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.