Home » మెంతులు చేదుగా ఎందుకు ఉంటాయో తెలుసా..?

మెంతులు చేదుగా ఎందుకు ఉంటాయో తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా ప్రతీ వంటింటిలో మెడికల్ ల్యాబ్ అనే చెప్పవచ్చు. మన పూర్వికులు ఎంతో ముందు చూపుతో ఆయుర్వేదంలో.. ఆహారంలో ఉపయోగపడే మసాలా దినుసులను మన వంటింటిలోకి చేర్చారు. వంట గదిలో ఉండే ఒక్కో మసాల దినుసులో ఉండే ఔషద గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను కల్పించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. మెంతి ఆకులను ఎక్కువగా ఆకుకూరగా వినియోగిస్తారు. అదేవిధంగా ఇతర వంటకాలలోను మెంతులను ఉపయోగిస్తుంటారు భారతీయ మహిళలు. 

Advertisement

మెంతి పొడిని అయితే ఊరగాయలలో.. మెంతి గింజలను చారు, పులుసు, పోపులలో వాడుతుంటారు. ముఖ్యంగా మెంతి ఆకులను పప్పుకూరలో, కూరల తయారీ లో వాడే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ పరిశోధనలలో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఎంతగానో ఉపయోగపడుతాయి అని నిర్ధారణ అయింది. మెంతులను ఆయుర్వేదంలో దీపని, మిత్రి అని పిలుస్తుంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండే ఈ మెంతి గింజల్లోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషద తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజల్లో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. 

Advertisement

Also Read :  జుట్టు ఒత్తుగా రావాలంటే ఈ చిట్కాలను పాటించండి.. ఫలితం పక్కా..!

Manam News

గింజలలోని జిగురు, చేదు రుచి ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధిత సమస్యలకు మెంతులు మంచి ఔషదం. స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్, మధుమేహం అదుపు చేసేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి. మెంతులు రక్తంలో చక్కర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారికి మెంతులు దివ్యమైన ఔషదంలా పని చేస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను మెంతులు తగ్గిస్తాయి. రాత్రి సమయంలో ఒక చెంచా మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున ఆ నీటిని తాగాలి. మెంతులలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. ఆహారం మితంగా తీసుకోవడం ఒంట్లో కొవ్వు కరుగుతుంది. మెంతి గింజలను పెనం పై వేయించి మెత్తగా దంచి పెట్టుకోవాలి. రోజు ఉదయం వేళలో ఆ పొడిని వేడి నీటిలో కలుపుకొని తాగితే ఎన్నో ఆరోగ్య సమ్యలు తొలిగిపోతాయి. 

Also Read : వారానికి మూడు సార్లు చేపలు తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!

Visitors Are Also Reading