Home » మీ మొబైల్‌ను మీరు జేబులో పెట్టుకుంటున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌తో మీకు ఇబ్బంది క‌లుగ‌వ‌చ్చు..!

మీ మొబైల్‌ను మీరు జేబులో పెట్టుకుంటున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌తో మీకు ఇబ్బంది క‌లుగ‌వ‌చ్చు..!

by Anji
Ad

ప్ర‌స్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువ అయింది. ప్ర‌తి ఒక్క‌రికీ నిత్య‌వ‌స‌ర వ‌స్తువులుగా మారిపోయాయి. ఏ ప‌నిని అయినా ఫోన్‌లో చేసుకుంటున్నారు. చివ‌రికి తినే ఆహార ప‌దార్థాల‌ను కూడా ఈఫోన్‌ల ద్వారా ఇంటి వ‌ద్ద‌కు ర‌ప్పించుకుంటున్నారు. చిన్న‌పిల్ల‌ల‌యితే మొబైల్స్‌కు బానిస‌ల‌యిపోయారు. ఫోన్ ఉంటేనే అన్నం తింటాం అనే ప‌రిస్థితికి దిగ‌జారారు. కొంద‌రు అయితే రెండు, మూడు ఫోన్లను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఇలా ఫోన్ల‌ను ఎక్కువ‌గా వినియోగించ‌డం ద్వారా ఆరోగ్య‌పరంగా ప‌లు స‌మ‌స్యలు సంభ‌వించే ప్ర‌మాద‌ముంది. అందులో త‌ల‌నొప్పిఒక‌టి. ఇప్పుడు చాలా మందికి ఎక్కువ‌గా త‌ల‌నొప్పి వ‌స్తుంది.


త‌ల‌నొప్పికి మొబైల్ వాడ‌డానికి ఏదైనా కార‌ణ‌ముందా అని ఆలోచిస్తే రెండు ర‌కాలుగా త‌ల‌నొప్పి వ‌స్తుంద‌ని తెలిసింది. ఒక‌టి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మ‌నం ఎక్కువ‌గా మొబైల్స్ వినియోగించ‌డం ద్వారా మ‌న‌పై ప్ర‌భావం చూపెడుతుంది. అదేవిధంగా ఇంట‌ర్నెట్ వాడిన‌ప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వ‌స్తుంది. ఎక్కువ‌గా ఇంట‌ర్‌నెట్ ను వాడిన‌ప్పుడు దాని ప్ర‌భావం చూపిస్తుంది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనే బ్రెయిన్ మీద ప్ర‌భావాన్ని ఎక్కువ‌గా చూపిస్తుంది. బ్రెయిన్ క‌ణాల‌ను ఎక్కువ‌గా వేడి అయ్యేవిదంగా చేస్తుంది. దీంతో ఎప్పుడైనా మ‌న బ్రెయిన్ హీట్ కి గురైన‌ప్పుడు ఆవ‌లింత‌లు రావ‌డం, ఒత్తిడి అనిపించ‌డం, నొప్పిగా అసౌక‌ర్యంగా ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.

Advertisement

Advertisement

ఇక రెండ‌వ‌ది మొబైల్స్ ఎక్కువ‌గా వాడిన‌ప్పుడు వాటి నుంచి వెలువ‌డి రేడియేష‌న్ వ‌ల్ల మ‌న బ్రెయిన్ లో ఉండే ర‌క్త‌నాళాలు సంకోచం చెందుతాయి. ఇలా సంకోచం జ‌రిగితే బ్రెయిన్ క‌ణాల‌కు ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఆగిపోతుంది. ర‌క్త‌నాళాల సంకోచం ఎక్కువ ప్ర‌భావం చూపిస్తుంది. ఈ రెండు కార‌ణాల‌తో చాలా మంది త‌లనొప్పి రావ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. అదేవిధంగా ఫోన్ రేడియేష‌న్ వ‌ల్ల డీఎన్ఏ బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశ‌ముంది. అదేవిధంగా బ‌ల‌హీనంగా ఉన్న డీఎన్ఏ నాశ‌నం అయ్యే అవ‌కాశం ఉంది. ఫోన్ రేడియేష‌న్ ప‌డ‌కుండా ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకోవాలి. ఇయ‌ర్ ఫోన్స్ రెండు ఒకేసారి పెట్టుకోకూడ‌దు. ఏదో ఒక‌టి మాత్ర‌మే పెట్టుకోవ‌డం బెట‌ర్. ముఖ్యంగా బ్రెయిన్ హీట్‌ను త‌గ్గించ‌డానికి మంచినీరు ఎక్కువ‌గా తాగాలి. ప్ర‌తి రోజూ త‌ల‌స్నానం చేయాలి. వీలుంటే ప్రాణ‌యామం కూడా చేయాలి. ఇలా చేయ‌డం ద్వారా బ్రెయిన్ హీట్ అనేది వెంట‌నే త‌గ్గిపోతుంది. త‌ల‌నొప్పి రాకుండా చేస్తుంది.

Also Read : 

ఆచార్య వ‌ల్ల ఆస్తులు అమ్ముకున్న కొర‌టాల‌..బ‌య్య‌ర్లకు అన్ని కోట్లు ఇచ్చేశార‌ట‌..!

స‌మంత నాగ‌చైత‌న్య కాపురంలో నిప్పులు పోసింది ఆవిడేనా..? మామూలు ట్విస్ట్ కాదుగా..!

 

Visitors Are Also Reading