మినపపప్పు ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉంటుంది. ఇది చాలా రుచిగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మినపపప్పుని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా దోసెలు, ఇడ్లీల కోసం వాడుతుంటారు. మినపపప్పులో విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్లు, సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం వంటి సమస్యలు తొలగించడానికి సహాయపడుతాయి. అదేవిధంగా మినపపప్పు తీసుకోవడం వల్ల తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు దూరమవుతాయి. అదేవిధంగా వీటిలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది.
Advertisement
ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్ పెంచడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ఇవి చాలా కీలకం. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ తగినంత పరిమాణంలో లభిస్తుంది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేసేందుకు సహాయపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు మినపప్పులో ఉంటాయి. దీనిని తరుచుగా తీసుకుంటే.. ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. అదేవిదంగా మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Advertisement
Also Read : ఈ నల్లని పండ్లు ఆ వ్యాధులకు అద్భుతమైన అవకాశం..!
కాయధాన్యాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. పప్పులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అదేవిధంగా ఇతర ఉదర సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొందరికీ ఎక్కువ వేడి చేసిన లేదా చలన చేసిన ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలాంటి వాళ్లు మినపపప్పుని మెత్తగా రుబ్బి దానిని రక్తం కారుతున్న ప్రదేశంలో పెడితే సమస్యపోతుంది. అలాగే మినపపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి ముఖానికి అప్లై చేసుకుంటే.. మొటిమల సమస్య కూడా పోతుంది. పురుషుల ఆరోగ్యానికి మినపపప్పు చాలా మంచిది.