సంక్రాంతి పండుగ పర్వదినాన ఉదయం వేళలో శివలింగానికి జలం సమర్పించడం వల్ల జీవితంలో నెలకొన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. దీనిని తప్పకుండా ఆచరించండి సంతోషంగా ఉండండి. మకర సంక్రాంతి రోజు నువ్వుల నీటితో స్నానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తుంటారు. ముఖ్యంగా నువ్వులు శని దేవుడికి ప్రీతికరమైన వస్తువు. దీంతో శని సమస్య నుంచి విముక్తి పొందడానికి నువ్వులను స్నానం చేసే నీటిలో వాడండి.
Advertisement
పండుగ రోజు చెట్లకు తులసి మొక్కలకు నీరు సమర్పించి పూజలు చేయడం వల్ల సుఖ, సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి. ఇవే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుందని నమ్ముతుంటారు. అనారోగ్య సమస్యలు మామూలే కాబట్టి.. తరచూ ఇబ్బంది పెడుతుంటూ సంక్రాంతి పండుగ రోజు నువ్వుల ముద్దను రాసుకోవాలి. కొన్ని నువ్వులు తీసుకొని పేస్టులా చేసుకోవాలి. దీనిని శరీరానికి పట్టించి ఏదో కొంత సమయం తరువాత తలస్నానం చేయాలి.
Advertisement
ఈ రోజు బెల్లం, పాలు, కలిపి చేసిన అన్నం తింటే సూర్యుడి అనుగ్రహం లభించి జాతక సమస్యలు తీరుతాయి. సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పేదలకు దుప్పటిని దానం చేయండి. మకర సంక్రాంతి రోజు శనిని పూజించాలి. ఈ రోజు నల్ల నువ్వులను, నువ్వుల నూనెను దానం చేయడం వల్ల శని సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతుంటారు.