Home » తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్…పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు.ఇవే కొత్త రూల్స్ !

తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్…పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు.ఇవే కొత్త రూల్స్ !

by Bunty
Ad

తెలంగాణ పదవ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రశ్నపత్రాల్లో ఎస్సై ప్రశ్నల సెక్షన్ లో ఇంటర్నల్ ఛాయిస్ తొలగించి, చాయిస్ ప్రశ్నలను పెంచారు. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తే, వాటిల్లో ఏవైనా నాలుగింటికి సమాధానాలు రాస్తే సరిపోయేలా మార్పులు తీసుకొచ్చారు.

Advertisement

ఈ మేరకు టెన్త్ పరీక్షల క్వశ్చన్ పేపర్ మోడల్ ను తెలంగాణ విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ జనవరి 11 ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనైతే క్వశ్చన్ పేపర్ లో ప్రతి సెక్షన్ లో ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉండేది. అంటే ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి అని రెండు ప్రశ్నలు ఇస్తారు. వాటిల్లో ఏదో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా జవాబు రాయవలసి ఉంటుంది.

Advertisement

తెలంగాణ టెన్త్-2023 క్వశ్చన్ పేపర్ మోడల్

  1. ఎస్సై ప్రశ్నలు 6 ఇస్తారు. వాటిల్లో ఏవైనా నాలుగు రాయాలి. ఒక్క ప్రశ్నకు ఆరు మార్పుల చొప్పున మొత్తం 24 మార్కులు ఉంటాయి.
  2. లఘు ప్రశ్నలు 6 ఇస్తారు. ఆరింటికి సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 24 మార్కులు ఉంటాయి.
  3. అతి లఘు ప్రశ్నలు 6 ఇస్తారు. ఆరింటికి సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 12 మార్కులు ఉంటాయి.
  4. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 20 ఇస్తారు. 20 ప్రశ్నలకు ఒక్కో మార్పు చొప్పున 20 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 80 మార్కులకు 36 ప్రశ్నలు ఇస్తారు. 36 ప్రశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది.

read also : “వాల్తేరు వీరయ్య” ఓటిటీ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

 

Visitors Are Also Reading