మనందరం ఆనందం, సంతృప్తితో కూడిన జీవితాన్ని కోరుకుంటున్నాం. అందుకోసం కష్టపడుతున్నాం. జీవితంలో ఆనందాన్ని కోరుకోని వారు ఉండరు. కొందరికీ ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. జీవితంలో విజయం సాదించాలంటే శ్రమ, అదృష్టం అవసరం. ఒక విధంగా అది నిజమే. ఆ అదృష్టాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏదైనా మార్గం ఉందా..? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక మార్గం ఉంది. ఈ 5 విషయాలపై శ్రద్ధ చూపడం మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది. పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తుంది.
Advertisement
జ్యోతిష్యశాస్త్రం మత గ్రంథాల ప్రకారం.. ఒక వ్యక్తి తన పళ్లు తోముకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ముఖం కడగాలి. అప్పుడు ఏదైనా తినాలి. అదేవిదంగా స్నానం చేయకుండా ఇంట్లో పూజ గదిలోకి ప్రవేశించవద్దు. పూజా వస్తువులను తాకవద్దు. జ్యోతిష్యం ప్రకారం.. భోజనం చేసేటప్పుడు దిక్కులు చూసుకోవాలి. ఆహారం కోసం ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి. అదేవిదంగా ఎప్పుడూ బూట్లు వేసుకొని తినకూడదు. భోజనం చేసేటప్పుడు ఆహారంలో మొదటి భాగాన్ని ఈశ్వరున్ని కోసం పక్కన పెట్టండి.
Advertisement
జ్యోతిష్యప్రకారం.. ఇంట్లో ప్రతిరోజు గంగాజలాన్ని చల్లుకోండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ప్రతి రోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసిన తరువాత ఇంట్లో గంగాజలం చల్లడం చాలా శ్రేయస్కరం. ఇంట్లోని పూజగదిలో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం శ్రేయస్కరం. పూజ సమయంలో పూజగదిలో నెయ్యి దీపం వెలిగించడం గుర్తుంచుకోండి. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సానుకూలత వచ్చి అంతా సాఫీగా సాగిపోతుంది.
Also Read :
Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకున్న ఫలితం వస్తుంది