మనం ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలన్నా ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లు అనేది శుభ్రం చేసుకుంటాం. ఈ శుభ్రం చేసే క్రమంలో చీపురును ఉపయోగిస్తాం. మనం చీపురు కదా అని పక్కన పడేస్తాం. కానీ తెలిసినవారు చీపురును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. సాధారణంగా మన ఇంటిని మనం శుభ్రం చేసుకున్న తరువాత చీపురు ఒక మూలన పెడతాం. ఈ సమయంలో చీపురు పట్టుకునే స్థానాన్ని కిందికి, ఊడ్చే స్థానాన్ని పైకి పెట్టి చీపురును మూలన పెడతాం.
Advertisement
చీపురుకట్టను అలా నిలబెడితే దరిద్ర దేవత మన ఇంట్లోకి వచ్చిందని అర్థం. అనవసరంగా చీపురుకట్టలను ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. చీపురును ఆగ్నేయ లేదా ఈశాన్య మూలలో పెట్టరాదు. వాయువ్య మూల లేదా నైరుతి మూల లోనే పెట్టాలి. సాధారణంగా మన ఇండ్లలో ఆడవారికి కోపం వస్తే చీపురుకట్టతో కొడుతూ ఉంటారు. ఇందులో 12 సంవత్సరాల లోపు పిల్లలని చీపురుకట్టతో కొడితే సరస్వతి దేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకొని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే శని ఆ ఇంట్లో అస్సలు ఉండదు. శుభ్రం చేసే క్రమంలో చెత్త అంతా బయట పడేయాలి.
Advertisement
చీపురును అందరికీ కనిపించేలా ఒకే దగ్గర ఉంచకూడదు కనిపించకుండా వాయువ్య మూలలో పెట్టాలి. అలాగే ఇంటి లోపల మరియు బయట ఒక చీపురు వాడవద్దు. పూజగదిలో మరీ ముఖ్యంగా చీపురును అసలు వాడవద్దు. సంధ్యా సమయానికి ముందే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లో చీపురు పెట్టరాదు. మంగళవారం మహాలయ పక్షము అనగా భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు నుంచి అమావాస్య వరకు ఉన్న సమయంలో చీపురును అసలు కొనరాదు. చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధన వర్షం కురుస్తుంది.
ALSO READ;
టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..?
ఆగ్రహంతో బైక్ దగ్ధం చేసిన వ్యక్తి..!