సాధారణంగా ఇంటి విషయంలో వాస్తు తప్పనిసరిగ్గా ఉండాలంటారు మన పెద్దలు. హైదరాబాద్ వంటి నగరాల్లో కేవలం పార్కింగ్ అంత స్థలంలోనే రెండు మూడు ఫ్లోర్లు వేసి అద్దెలు వసూలు చేస్తుంటారు. చిన్న స్థలాలే కాదు.. పెద్ద స్థలాలు, అపార్టుమెంట్లలో కూడా కిచెన్, నీటి సంపు, బెడ్ రూమ్, హాల్ వాస్తు ప్రకారం అస్సలుండవు. కొంత మంది మాత్రమే వాస్తును పాటిస్తుంటారు. వాస్తు నిపుణులకు గౌరవం ఇచ్చి అచ్చం అలాగే ఇంటిని నిర్మించుకుంటారు.
Advertisement
వాస్తు నిపుణల ప్రకారం.. ఏ ఇంట్లో అయితే నీరు వృధాగా పోతుందో.. ఆ ఇంట్లో డబ్బు నిలువదు అని.. ఆర్థిక ఇబ్బందులు తిష్టవేస్తాయట. అందుకే ఇంట్లో నల్లాలు లీక్ అవ్వడానికి ఇదే కారణం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు ఏంటి అనే సందేహం చాలా మందికి రావచ్చు. వాస్తవానికి నీరు వృధా అంటే వరుణు దేవునికి కోపం తెప్పించడమేనట. దీంతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరుతుందట.
Advertisement
అక్కడి నుంచి సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కిచెన్ లో నల్లాలు లీక్ అయితే నిప్పు ఉన్న చోట నీళ్లు కారడం అశాంతికి చిహ్నం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో అనారోగ్య సమస్యలకు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందట. ఇంట్లో లీక్ అయ్యే నల్లాలుంటే వృధా ఖర్చులను పెంచుతాయట. వీలైనంత త్వరగా ఆ నల్లాలు రిపెయిర్ చేయించాలి అనవసర ఖర్చులకు బ్రేక్ వేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్ని అనర్థాలకు కారణమైనటువంటి నీటి వృధాను తగ్గించుకోవడం చాలా ఉత్తమం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :