టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండా ఇంకా అలానే బ్యాచిలర్ లైఫ్ నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. కానీ గత రెండు సంవత్సరాల నుంచి చాలామంది నటీనటులు పెళ్లి చేసుకున్నారు. వారు తమ వివాహ బంధాన్ని మొదలుపెట్టారు. హీరోయిన్ నిక్కీ గల్రాని,హీరో ఆది పినిశెట్టి ఇద్దరు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే ఇంకో వైపు హీరో అడవి శేషు తన తాజా చిత్రమైన మేజర్ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూన్ మూడవ తేదీన థియేటర్లలోకి రానుంది. దీనిలో భాగంగా అడవి శేషు సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో అడవి శేష్ కి పెళ్లి టాపిక్ ఎదురయింది. మీరు పెళ్లి ఇంకా ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు హీరో ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చాడు. నాకంటే ముందు ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.నా ఫ్రెండ్స్ అనుష్క, ప్రభాస్ లు కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు అని, వాళ్ళిద్దరి పెళ్లి అయిన తర్వాతే నేను చేసుకుంటానని హీరో అడవి శేష్ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు. ఈయన చెప్పిన ఈ ఆసక్తికరమైన విషయం తో ప్రభాస్,అనుష్కల పెళ్లి మరోసారి తెర మీదకు వచ్చింది. అయితే ప్రభాస్, అనుష్క ఇద్దరు మంచి స్నేహితులమని వాళ్లు గతంలో ఎన్నో సార్లు చెప్పారనే విషయం తెలిసిందే. అయితే హీరో అడవి శేష్ వ్యాఖ్యలతో మరోసారి ఇండస్ట్రీలో వారి పెళ్లి టాపిక్ చర్చనీయాంశమైంది.
Advertisement
ALSO READ;
Advertisement
అల్లు రామలింగయ్య అల్లుడయ్యినందుకే చిరు హీరోగా ఎదిగారా..? అందులో నిజమెంత..!
“ఫిదా” సినిమాలో ఈ మిస్టేక్ ను గమించారా..? శేఖర్ కమ్ముల ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్..!