సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఫస్ట్ పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ అందులో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది టీ. మన దేశమంతటా కోట్లాది మంది టీని తాగుతారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం టీ తాగే అలవాటుంటుంది. ప్రధానంగా శీతాకాలంలో తమకు ఇష్టం వచ్చినప్పుడూ టీ కాచుకొని తాగుతుంటారు. శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవానికి టీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చాలా మందికి ఈ విషయం తెలిసినప్పటికీ దానికి దూరంగా మాత్రం ఉండలేరు. టీ లో చక్కరకి బదులు బెల్లంను వాడితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బెల్లం టీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్ బీ12, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతాయి. చక్కర కి బదులు బెల్లం వేసి తయారు చేసిన టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ప్రతి రోజు బెల్లం టీ తాగడం వల్ల ఉదర సంబంధ సమస్యలు దూరమవుతాయి. అదేవిధంగా మలబద్ధకం, ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణక్రియను మెరుగుపడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడుతున్న వారు బెల్లం టీ తాగితే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. బెల్లం టీలో ఉండే ఐరన్ కారణంగా ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. బెల్లం టీని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది.
Advertisement
Advertisement
బరువు తగ్గాలనుకునే వ్యక్తులు టీ కి దూరంగా ఉండడం ఉత్తమం. టీ లో ఉండే చక్కర వల్ల శరీరంలో కొవ్వు పెరిగి అధిక బరువు పెరిగే అవకాశముంది. ఒకవేళ మీరు టీని మానేయలేకపోతే.. అందులో చక్కెరకు బదులు బెల్లం టీ తీసుకోవాలి. బెల్లం టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గి బరువు తగ్గుతారు. కొందరూ మైగ్రేన్ వంటి తీవ్రమైన తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ప్రతి రోజూ బెల్లం టీ తాగితే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. బెల్లంలో ఉండే పోషక మూలకాలు మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also Read : ఢిల్లీలో కారుతో 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది ఈమెనే..!