Telugu News » Blog » ఢిల్లీలో కారుతో 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది ఈమెనే..!

ఢిల్లీలో కారుతో 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది ఈమెనే..!

by Anji
Ads

ఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 20 ఏళ్ల యువతి అంజలి సింగ్ గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడే అంజలి ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ ఉండేదని, పిల్లలతో ఆడుకోవడమే ఆమెకు ఎంతో ఇష్టం అంజలి కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. అంజలి ఒక్కరే ఆమె కుటుంబానికి ఆధారం. ఆమె సంపాదనతోనే కుటుంబాన్ని నడిపేవారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆహార పథకం ద్వారా వారికి పూట గడుస్తుంది. చుట్టు పక్కల ఉన్న మహిళలకు మేకప్ వేస్తూ.. అంజలి కొంత సంపాదించే వారు. మరోవైపు పెళ్లిళ్లు, పలు కార్యక్రమాల్లో చిన్న చిన్న పనులు చేస్తూ మరికొంత ఆర్జించేవారు. 

Advertisement

అంజలి కుటుంబం ఢిల్లీలోని మంగోల్ పురి ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తుంది. ఆరుగురు సంతానం లో అంజలి రెండో అమ్మాయి. కుటుంబ పోషణ కోసం ఆమె చిన్న వయస్సులోనే చదువు మానేసి చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల కిందట తండ్రి మరణించడంతో తల్లి రేఖ స్కూల్ లో పనిలో చేరారు. కరోనా లాక్ డౌన్ సమయంలో అనారోగ్య కారణంతో ఆ పనిని మానేశారు. అంజలి సమీపంలో ఉన్నటువంటి ఓ బ్యూటి పార్లర్ లో మేకప్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ కుటుంబ అవసరాలు తీర్చడం ప్రారంభించారు. ఆమె అక్కా చెళ్లెళ్లలో ఇద్దరికి పెళ్లి అయింది. కానీ తన తమ్ముళ్లు స్థిరపడిన తరువాత తాను పెళ్లి చేసుకుంటానని అంజలి చెప్పిందని రేఖ అన్నారు. తనను చేసుకోబోయే వ్యక్తి తమ కుటుంబంతో కలిసి ఉండేందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని అంజలి చెప్పేదని.. అప్పుడు కుటుంబాన్ని తాను చూసుకోవడం కొనసాగించవచ్చని భావించిందని తల్లి రేఖ వెల్లడించింది. 

Also Read :  సావిత్రితో క‌లిసి తాగుతూ ఆమెను దారుణంగా మోసం చేసిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..చివ‌రికి అత‌డి వ‌ల్ల‌నే..!

Advertisement

Manam News

నూతన సంవత్సరం రోజు తెల్లవారుజామున ఢిల్లీలో హిట్ అండ్ రన్ కేసులో అంజలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. స్కూటర్ పై వెళ్తున్న అంజలిని ఓ కారు ఢీ కొట్టింది. వారు ఆ కారును ఆపకుండానే దాదాపు 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో అంజలి చనిపోయింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. అంజలి తలకు బలమైన గాయం కావడం, తీవ్ర రక్త స్రావం, వెన్నెముక దెబ్బ తినడంతో మరణించిందని తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన అంజలి కుటుంబ సభ్యులు ఆమెపై అtyaచారం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా అంజలి మృతదేహం స్వాధీనం చేసుకున్న సమయంలో ఆమెకు ఎలాంటి వస్త్రాలు కూడా లేవని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కానీ పోస్టుమార్టం నివేదికలో మాత్రం అలాంటిది ఏమి లేదని పోలీసులు తెలిపారు. 

Also Read :  టమాటా గింజల్లో విషం ఉంటుందా ? వారు తింటే ఆ సమస్య తప్పదు..!

Manam News

ముఖ్యంగా అంజలి తమ చుట్టుపక్కల వారికి బాగా తెలుసు అని చెప్పారు. తమ వీధుల్లో ఉండే గుంతలను పూడ్చాలని స్థానిక రాజకీయ నేతలకు తమ కూతురు ఫిర్యాదు చేసిందని తల్లి రేఖ చెప్పారు. చనిపోవడానికి ముందు ఆమె తమ ప్రాంతంలోని డ్రైనేజీ సిస్టమ్ ని బాగు చేయించేందుకు కార్పొరేటర్ ని నిలదీసింది. పలువురు ఆమెను మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయమని ప్రోత్సహించే వారు. భవిష్యత్ లో నిల్చుంటానని ఆమె వారికి వాగ్దానం చేసింది. దాదాపు ఐదేళ్ల కిందట అంజలి లోన్ తీసుకుని సొంతంగా స్కూటర్ తీసుకుందని, స్కూటర్ పైనే తాను ప్రయాణించేదని వివరించారు. ఆ స్కూటర్ మీదనే నూతన సంవత్సరం మొదటి రోజే ఇంటికి తిరిగి వస్తూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.  

Advertisement

Also Read :  ఈ ఫోటోలో చిరంజీవి ఎత్తుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా..?