సాధారణంగా మన కుటుంబ సభ్యులు లేదా మన బంధుమిత్రులు ఎవరైనా మరణించినట్టయితే చాలా మందికి వారు కలలో కనిపిస్తుంటారు. ఇలా తరుచూ చనిపోయిన వారు మన కలలో కనిపించడం వల్ల కొందరూ భయాందోళన చెందుతుంటారు. వాస్తవానికి చనిపోయిన వారు అసలు కలలో కనిపించడానికి కారణం ఏంటి..? ఎందుకు ఇలా కలలో కనిపిస్తారో అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా..? మీకు వచ్చిన డౌట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఇక స్వప్నశాస్త్రం ప్రకారం.. మరణించిన వారు తరచూ కలలో కనిపిస్తుంటారు. అనగా వారి ఆత్మకు లో ఈ లోకంలో సంచరిస్తుందని అర్థం. ఇలా మరణించిన వారి ఆత్మలో మనకు కలలో కనిపించినప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. చనిపోయిన వారు కలలో తరచు కనిపిస్తే వారి పేరున రామాయణము భగవద్గీత వంటి పురాణాలను చదవాలి. ఒకవేళ వారు ఎంతో బాధతో ఏమీ మాట్లాడకుండా మన కలలో కనిపించినట్లయితే మీరు ఏదో తప్పు చేయబోతున్నారనే సంకేతం గుర్తుంచుకోవాలి.
Advertisement
చనిపోయిన మన బంధువులు ఆకలితో కనిపిస్తే వెంటనే పేదలకు అన్నదానం చేయాలి. అప్పుడే మన బంధువుల యొక్క ఆత్మ చాలా సంతోషపడుతుంది. కోపంతో చనిపోయిన వ్యక్తులు మీ కలలో కనిపించినట్టయితే వారు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని భావించాలి. కలలో చెప్పిన విధంగా ఆ పద్ధతులను పాటించడం వల్ల అతని ఆత్మ సంతృప్తి చెందుతుంది. కొన్నిసార్లు మరణించిన మన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా నవ్వుతూ కనిపిస్తుంటారు. కొన్నిసార్లు అలా సంతోషంగా నవ్వుతూ కనిపించడం వల్ల మనకు అన్ని శుభాలు కలిగిస్తాయని పండితుల పేర్కొంటున్నారు. చాలామంది తీరని కోరికలతో చనిపోయి ఉంటారు కాబట్టి కలలు వారు మనకు ఏదైనా చేయమని సలహా ఇస్తే.. తప్పకుండా చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది ఈ లోకం వదిలి వెళుతుందని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మీకు సిగరేట్ అలవాటు ఉందా ? క్యాన్సర్ తో పాటు మరో ప్రమాదం కూడా.. జాగ్రత్త..!
అకస్మాత్తుగా మారుతున్న వాతావరణంతో ఎదుర్కొనే సమస్యలు ..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?
డబ్బు కోసమే వరుణ్ తేజ్ లావణ్యను పెళ్లి చేసుకుంటాడా…? తెరపైకి షాకింగ్ సీక్రెట్..!