మెగాస్టార్ చిరంజీవిని ఓ హీరో అనే కంటే ఆయన టాలీవుడ్ కు ఓ బ్రాండ్ అనే చెప్పాలి. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని టాలీవుడ్ లోకి ఎంతోమంది యంగ్ హీరోలు అడుగుపెట్టారు. ఇప్పటికీ వస్తున్న కొత్తవాళ్లు కూడా తాము చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చామని చెబుతుంటారు. ఇక చిరంజీవి కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు సైతం చేసిన సంగతి తెలిసిందే. విలన్ గా మెప్పించిన చిరు ఆ తరవాత హీరో పాత్రలు అందుకున్నారు.
Advertisement
హీరోగా తన డ్యాన్స్ నటనతో ప్రేక్షకులను మైమరిపించారు. వరుస విజయాలను అందుకుని స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. ఇదిలా ఉండగా చిరు హీరోగా ఎదుగుతున్న తీరు ఆయన క్రమ శిక్షణ చూసి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను ఇచ్చి వివాహం చేశారు. కానీ చిరు ఓ తప్పు చేసుంటే అసలు అల్లు వారి ఫ్యామిలీకి అల్లుడు అయ్యిండే వాడు కాదట.
Advertisement
చిరంజీవి చాలా మంచి వాడు క్రమశిక్షణ గలవాడు అని తెలుసుకున్న అల్లు రామలింగయ్య మొదట తన కుమారుడు అరవింద్ ను పిలిచి చిరు గురించి తెలుసుకోవాలని ఆరా తీయాలని చెప్పారట. దాంతో అల్లు అరవింద్ చిరుతో పనిచేసిన పలువురు నటీనటులను దర్శకనిర్మాతలను ఆరా తీయగా ప్రతిఒక్కరూ మెగాస్టార్ గురించి గొప్పగా చెప్పారట. అదే విషయాన్ని అల్లు అరవింద్ తన తండ్రికి వివరించారట.
ఇదిలా ఉండగా చిరంజీవి అల్లు రామలింగయ్య ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి ట్రైన్ లో ప్రయాణించారట. ఆ రోజున అల్లు రామలింగయ్య వైన్ గ్లాస్ తీసుకుని చిరంజీవిని తాగమని చెప్పారట. కానీ చిరు మాత్రం తనకు అలవాటు లేదని చెప్పారట. దాంతో అల్లు రామలింగయ్య అప్పుడే చిరు తన అల్లుడు అని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ చిరు అల్లు రామలింగయ్య ఆఫర్ చేసిన వైన్ తాగి ఉంటే ఆయన నిర్ణయం మరోలా ఉండేదేమో.
ALSO READ : చిరంజీవి గురించి బన్నీ ఇంట్లో ఏమంటాడో చెప్పిన అల్లుఅరవింద్..!