Telugu News » Blog » ANR వాణిశ్రీతో నవ్వుతూ ఉంటే..NTR మాత్రం అలా ఉండేవారా.. వాణిశ్రీతో వారిద్దరి బిహేవియర్ ఎలా ఉండేదో చెప్పిన రమణయ్య..!!

ANR వాణిశ్రీతో నవ్వుతూ ఉంటే..NTR మాత్రం అలా ఉండేవారా.. వాణిశ్రీతో వారిద్దరి బిహేవియర్ ఎలా ఉండేదో చెప్పిన రమణయ్య..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాడు టాప్ హీరోయిన్లలో వాణిశ్రీ ఒకరిగా ఉండేవారు. తన నటన అభినయంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కళాభినేత్రిగా పేరు తెచ్చుకున్న వాణిశ్రీ, సావిత్రి తర్వాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న కథానాయక. ఈమె తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. వివాహం తర్వాత నటనకు దూరమై మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అత్త పాత్రలో నటించింది.

Advertisement

also read:Rishabh Pant : కారు యాక్సిడెంట్‌లో టీమిండియా క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు గాయాలు

ఆ విధంగా ఆమె సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఆమెకు అసిస్టెంట్ గా పనిచేసిన రమణయ్య పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వాణిశ్రీ ఎన్టీఆర్, ఏఎన్నార్ తో చాలా సినిమాల్లో నటించింది. ఇద్దరు అగ్ర హీరోలు వాణిశ్రీతో ఎలా ఉండేవారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ సొంత మూవీ విరాటపర్వం చిత్రంలో నటించినప్పుడు వాణిశ్రీ గారిని చక్కగా చూసుకునేవారట. మొదట ఆయన సొంత బ్యానర్ లో సినిమా అనగానే వాణిశ్రీ గారికి వద్దని, ఆయన కోపంగా ఉంటారని ఇంట్లో వాళ్లందరం చెప్పామంటూ రమణయ్య తెలియజేశారు.

Advertisement

కానీ ఎన్టీఆర్ మరియు ఆయన భార్య వాణిశ్రీతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ షూటింగ్ కి ఆహ్వానించారట. అప్పట్లో అక్కను ఎన్టీఆర్ ఏమండీ అని పిలిచేవారు అంటూ రమణయ్య తెలిపారు. ఇక ఏఎన్ఆర్ గారు అక్కను అమ్మాయి అంటూ పిలిచేవారు. ఆ విధంగానే అక్క కూడా అందరితో చాలా మర్యాదగా నడుచుకోవడం వల్ల అందరూ ఆమెతో మర్యాదగా ఉండేవారని తెలిపారు. ఎన్టీఆర్ చాలా గంభీరంగా ఉండేవారు అంటూ , కానీ ఏఎన్ఆర్ మాత్రం సరదాగా, నవ్విస్తూ ఉండేవారు అంటూ వారిద్దరి మధ్య తేడాలు తెలియజేశారు రమణయ్య.

Advertisement

also read:Janardan:నటుడు జనార్ధన్ కు శోభన్ బాబును మించి ఆస్తులన్నాయా..?

You may also like