ఆసియా కప్ ఈ నెల 27న ప్రారంభం కాగా.. 28న చిరకాల ప్రత్యర్ధులు అయిన ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో గత టీ20 ప్రపంచ కప్ ఓటమికి బదులు అనేది తీర్చుకుంటూ ఇండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ కోసం జనాలు ఎంతగా ఎదురు చూసారో.. వారిని అంతగా ఎంజాయ్ చేస్తూ.. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగింది.
Advertisement
అయితే ఈ మ్యాచ్ ముగిసి మూడు రోజులు అవుతున్న.. దీని పై ఇంకా చర్చలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఐసీసీ ఇండియా, పాకిస్థాన్ జట్లకు ఫైన్ అనేది వేసింది. ఈ రెండు జట్లు మ్యాచ్ లో నిర్ణిత సమయంలో బౌన్గ్ అనేది పూర్తి చేయలేకపోయాయి. అందుకే స్లో ఓవర్ రేట్ కింద రెండు జట్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత అనేది విధించింది.
Advertisement
ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత జట్టు నుండి మొత్తం 13.20 లక్షలు జరిమానా రూపంలో ఐసీసీ వెళ్లగా…. పాకిస్థాన్ జట్టుకి నుండి కేవలం 5.92 లక్షలు మాత్రమే వెళ్లనున్నాయి. అందుకు కారణం ఏమిటంటే.. పాకిస్థాన్ ఆటగాళ్ల కంటే మన భారత ఆటగాళ్లకు ఎక్కువ మ్యాచ్ ఫీజ్ అనేది వస్తుంది. ఇక ఐసీసీ ఎవరికి ఎంత వస్తుంది అనేది చూడదు. వచ్చే దానిలో 40 శాతం జరిమానాగా వేస్తుంది అనేది తెలిసిందే.
ఇవి కూడా చదవండి :