ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ జరిగిన రావాల్పిండి పిచ్‌కు ఐసీసీ బీ లో యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. అదేవిధంగా ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఐదేళ్లలో 5 డిమెరిట్ పాయింట్లు వస్తే 12 నెలల పాటు ఆ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు వీలులేదు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్టు ఆడిన తొలి టెస్ట్ లో పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలించింది.
Advertisement
దీంతో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ నాలుగు సెంచరీలు బాదేశారు. అటు ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ టెస్ట్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 476/4 డిక్లెర్డ్, రెండవ ఇన్నింగ్స్ లో 252/0 స్కోర్లు చేయగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తంగా ఈ టెస్ట్‌లో ఐదు రోజుల పాటు 379 ఓవర్లు వేయగా.. 14 వికెట్లు మాత్రమే నేలకూలాయి. మరొక వైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రిసిడెంట్ రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Advertisement
పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంపై కనేరియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెత్త పిచ్ కారణంగానే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిందన్నాడు. చాలా ఏళ్ల తరువాత పాకిస్తాన్ పర్యటనకు ఆస్ట్రేలియాకు రాగా.. మంచి పిచ్‌ను తయారు చేయడంలో పీసీబీ విఫలమైందని విమర్శించాడు. పనికి మాలిన పిచ్ తయారు చేయించిందే గాక.. ఇంకా దానిని సమర్థించుకోవడం ఏమిటని రమీజ్ రాజాను నిలదీశాడు. ఇది ఎలాంటి పిచ్ అంటే రమీజ్ రాజా ఈ వయస్సులో ఆడినా కూడా అక్కడ పరుగుల వరద పారించగలడంటూ కనేరియా ఎద్దేవా చేసాడు.
Also Read : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి..!