Telugu News » Blog » ష‌ణ్ముకు నేను జ‌స్ట్ ఫ్రెండ్స్ మాత్ర‌మే.. మా మ‌ధ్య ఏం లేదు : సిరి హన్మంత్

ష‌ణ్ముకు నేను జ‌స్ట్ ఫ్రెండ్స్ మాత్ర‌మే.. మా మ‌ధ్య ఏం లేదు : సిరి హన్మంత్

by Bunty
Ads

ప్ర‌తి బిగ్ బాస్ సీజ‌న్ లో ఒక ల‌వ్ స్టోరీ జరుగుతు ఉంటుంది. ఈ సారి బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ – 5 లో కూడా ఒక ల‌వ్ స్టోరీ పీక్స్ కు వెళ్లింది. బిగ్ బాస్ మొదలు అయిన నాటి నుంచి చివ‌రి ఎపిసోడ్ వ‌ర‌కు హ‌గ్ ల వ‌ర్షం కూరుస్తునే ఉంది. 106 ఎపిసోడ్ లపాటు హ‌గ్ యుద్దం ఆగ‌లేదు. ఎవ‌రి మ‌ధ్య అంటే సిరి – ష‌ణ్ముక్. దీని ఫ‌లితం గా ష‌ణ్ముక్ టైటిల్ లాస్ అయ్యాడు. అలాగే క్యారెక్ట‌ర్ ను కూడా లాస్ అయ్యాడు. అలాగే సిరికి కూడా క్యారెక్ట‌ర్ బాగానే లాస్ అయింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మాములు గానే ఉన్నా.. బ‌య‌టకు వ‌చ్చిన త‌ర్వాత దాని ఫ‌లితం క‌నిపిస్తుంది.

Advertisement

Advertisement

తాజా గా సిరి ఒక యూట్యూబ్ ఛాన‌ల్ ష‌ణ్ముక్ హ‌గ్ ల గురించి ప్రశ్నించ‌గా.. ఇంట‌ర్వ్యూ మ‌ధ్య‌లో నుంచే బ‌య‌టకు వెళ్లి పొయింది. అయితే యాంక‌ర్ మ‌ళ్లీ తీసుకురాగా.. త‌న మ‌న‌స్సు లోని బాధ ను చెప్పింది. తాను ష‌ణ్ముక్ మ‌ధ్య‌లో ఎలాంటి బంధం లేద‌ని త‌మ జ‌స్ట్ ఫ్రెండ్స్ షిప్ అని చెప్పింది. అలాగే తాను ష‌ణ్ముక్ మంచి ఫ్రెండ్స్ అని అనుకున్నాం. కానీ ఆడియ‌న్స్ దీన్నీ ఒప్పు కోలేద‌ని అన్నారు. దీనికి ఆడియ‌న్స్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అలాగే త‌న పై వ‌స్తున్న చెడు కామెంట్స్ ను చూడ‌లేక పోతున్నానని అన్నారు. త‌న లైఫ్ లోనే ఇలాంటి కామెంట్స్ ఇన్ని కామెంట్స్ చేడ‌లేద‌ని అన్నారు. అంతే కాకుండా కొంత మంది సోష‌ల్ మీడియా ద్వారా ఎక్కువ గా మాట్లాడుతున్నారని అన్నారు.

Advertisement

అయితే తాను గెలుపు తో పాటు ఓట‌మిని కూడా స్వీక‌రిస్తాన‌ని అన్నారు. అలాగే త‌మ‌ అమ్మ వ‌చ్చిన స‌మ‌యంలో హ‌గ్స్ వ‌ద్దని చెప్పింద‌ని అప్ప‌టి నుంచి హగ్స్ పై ఆలోచించామ‌ని అన్నారు. అలాగే చివ‌ర‌గా త‌న‌కు ష‌ణ్ముకు మధ్య ఎలాంటి చెడు ఉద్ధేశం లేద‌ని తెలిపారు. చెడు ఉద్ధేశం ఉంటే కెమెరాల ముందు అలా చేయమ‌ని అన్నారు. హౌస్ లో జ‌రిగిన‌దానికి నెగెటివ్ గా అర్థం చేసుకోకండని అన్నారు. త‌న‌కు ష‌ణ్ముకు మ‌ధ్య మంచి ఫ్రెండ్ షీప్ ఉందని తెలిపారు.