జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా పరిచయమైన చాలా మంది ప్రస్తుతం బుల్లి తెరపై వెండితెరపై రానిస్తున్నారు. కేవలం కామెడియన్ లు మాత్రమే కాకుండా యాంకర్ లు కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అనసూయ, రష్మి సినిమాల్లో, బుల్లితెరపై ఇతర టీవీషోలలో నటిస్తున్నారు. ఇక ఈ షో ద్వారా క్లిక్ అయిన కమెడిన్లను చూస్తే….చమ్మక్ చంద్ర, చంటి, ధన్ రాజ్, గెటప్ శ్రీను, టిల్లు, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ సహా మరికొందరు ఉన్నారు.
Advertisement
అయితే వీరిలో చాలా మంది అనేక కారణాల వల్ల ఇప్పటికే జబర్దస్త్ ను వీడి ఇతర టీవీ షోలలో సందడి చేస్తున్నారు. అయితే హైపర్ ఆది మాత్రం జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారు. హైపర్ ఆది మొదట బీటెక్ చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు. కానీ నటనపై ఉన్న ఆసక్తితో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట ఓ టీంలో సభ్యుడిగా కనిపించిన ఆది ఆ తరవాత తన కామెడీ టైమింగ్ పంచ్ లతో అతితక్కువ కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగాడు. అప్పటి నుండి జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారు. ముఖ్యమైన కమెడియన్ గా జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు.
Advertisement
ఇదిలా ఉంటే హైపర్ ఆది కూడా గత రెండు వారాల నుండి జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో హైపర్ ఆది కూడా జబర్దస్త్ కు దూరయ్యాడని ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. హైపర్ ఆది లేకుండా షో చూడమని జబర్దస్త్ ప్రోమోకు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ హైపర్ ఆది జబర్దస్త్ ను వీడిరా లేదా అన్నదానిపై పూర్తిగా క్లారీటీ రాలేదు.
మరోవైపు హైపర్ ఆది మల్లెమాల వారి షోలతో పాటూ ఇతర ఛానల్స్ లో కూడా షోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా సినిమాల్లో కూడా హైపర్ ఆది బిజీగా ఉన్నారు. రీసెంట్ గా భీమ్లానాయక్ సినిమాలో కూడా కనిపించారు. అందువల్లే ఆది బ్రేక్ తీసుకున్నారని కూడా కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే ఆది స్పందించాల్సిందే.