మీ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారా? బుల్లి బుల్లి సైజు నుంచి, పెద్దపెద్ద కుక్కల గురించి అందరికీ తెలిసిందే. పొట్టిగా, పొడవుగా, ఎత్తుగా ఇలా ఎన్నో రకాలుగా ఉండే కుక్కలు దాదాపు 200 జాతుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడో చరిత్రకు పూర్వమే మానవుడు కుక్కలను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. అప్పటినుంచి తమ కోరికలకు అనుగుణంగా వీటిల్లో కొత్త కొత్త రకాలను కూడా సృష్టిస్తున్నారు. కాగా, తాజాగా ఓ వ్యక్తి దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి కుక్కను కొనుగోలు చేశాడు.
Advertisement
ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకోగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగుళూరులోని కడబామ్స్ కెన్నెల్స్ ఓనర్, ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్, అరుదైన కుక్కను కొనుగోలు చేశాడు. కాకాసీయన్ షెపెర్డ్ కు చెందిన కుక్కను రూ.20 కోట్లకు కొనుగోలు చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన వ్యక్తి ఆ కుక్కను అమ్మడం విశేషం. దాని వయసు సంవత్సరంన్నర. దీని పేరు ఒక కడాబామ్ హేడర్.
Advertisement
ఈ కుక్కకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది త్రివేండ్రమ్ కెన్నెల్ క్లబ్ ఈవెంట్, క్రౌన్ క్లాసిక్ డాగ్ షోలో పాల్గొంది. బెస్ట్ డాగ్ బ్రీడ్ కింద 32 కు పైగా మెడల్స్ గెలుచుకుంది. హేడర్ జీవిత కాలం 10 నుంచి 12 సంవత్సరాలు. 45 నుంచి 70 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ జాతి కుక్కలు మన దేశంలో కంటే, ఆర్మేనియా, సర్కాసియా, జార్జియా, రష్యా వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రూ. 20 కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేయడంతో, సతీష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.
READ ALSO : పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది అప్పుడేనట.. బ్రహ్మం గారి కాలజ్ఞానం వైరల్