ఐపీఎల్ 2022 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇరు జట్లు తొలి మ్యాచ్‌ను ఆడాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో రెచ్చిపోయిన ఆ జట్టు తొలి మ్యాచ్‌లోనే 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను ఓడించింది.
రాజస్థాన్ జట్టు నిర్దేశించిన 211భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. హైదరాబాద్ బ్యాటర్లలో మార్‌క్రమ్ (57 41 బంతుల్లో 5×4, 2×6) చివరి తేదీ వరకు పోరాడారు. అయినా అతనికి సహకరించే వారు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. వాషింగ్టన్ సుందర్ (40 : 14 బంతుల్లో 5×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రొమెరియో షెఫర్డ్ (24) పర్వాలేదనిపించారు. మొత్తంగా బ్యాటర్లు, బౌలర్లు అందరూ విఫలమయ్యారు. చాహల్ 03, ప్రసిద్ధ కృష్న, బౌల్ట్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
Advertisement
Advertisement
మ్యాన్ ఆప్ ద మ్యాచ్ సంజు శాంసన్ (41 29 బంతుల్లో 4×4, 2×6) జోస్ బట్లర్ (35, 28 బంతుల్లో 3×4, 3×6) హెట్‌మేయర్ (32 : 13 బంతుల్లో 2×4, 3×6) చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 210 పరుగుల స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటకట్టుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ను ప్రారంభంలోనే దురదృష్టం నోబాల్ రూపంలో వెంటాడింది. ఇన్నింగ్స్ ఐదో బంతికే బట్లర్ ఖాతా తెరవకుండానే భువనేశ్వర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సన్‌రైజర్స్ సంబరాల్లో మునిగింది. అంతలోనే ఎంఫైర్ నోబాల్ ప్రకటించాడు. ఈ అవకాశాన్ని బట్లర్ వినియోగించుకున్నాడు.
Also Read : RRRలో మల్లి పాత్రలో నటించిన చిన్నారి ఎవరు..?ఆమెకు జక్కన్న ఎలా అవకాశం ఇచ్చారంటే…?