మామూలుగా పోలీసులు అంటేనే ప్రజలు భయపడుతుంటారు. అలాంటిది పోలీసులే ఓ మోటార్ సైకిల్ కొనుగోలు చేసి మానవత్వం చాటారంటే వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ వాస్తవం అండి. పోలీసులే స్వయంగా మానవత్వమును చాటుకున్నారు. చెమటలు కార్చుతూ సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్న ఓ యువకునికి మోటార్ సైకిల్ కొనిచ్చారు.
Advertisement
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ఇండోర్‌లోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 22 సంవత్సరాల వయస్సు కలిగిన జే హాల్డే జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. బైకు లేకపోవడంతో తనకు ఉన్న సైకిల్‌పైనే ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాడు. విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇన్‌చార్జీ తెహజీబ్ ఖాజీ రాత్రి సమయంలో పెట్రోలింగ్‌లో ఆ యువకుడిని చూశాడు. సైకిల్ తొక్కుతూ చెమటలు కార్చుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్న హాల్డే వివరాలను ఆరా తీశాడు.
Advertisement
కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా బైకు కొనుగోలు చేయలేక సైకిల్ పైనే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు చెప్పాడు. మానవత్వంతో హాల్డేను ఆదుకునేందుకు విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సిబ్బంది ముందుకొచ్చాడు. వారందరూ కలిసి రూ.32వేలు వసూలు చేశారు. ఓ ఆటోమొబైల్ షో రూమ్‌లో అడ్వాన్స్ తొలి రుణ వాయిదా చెల్లించి ఓ బైకు కొనుగోలు చేసారు. ఆ బైకును హాల్డేకు అందజేసారు. దీంతో అతడు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు. మిగతా ఈఎంఐలను తానే చెల్లిస్తాను అని చెప్పాడు. గతంలో రాత్రి సమయంలో 6 నుంచి ఎనిమిది ఫుడ్ పార్సిళ్లను డెలివరీ చేసే వాడినని.. పోలీసులు బైకు ఇప్పించడంతో 15 నుంచి 20 వరకు ఫుడ్ పార్సిల్స్‌ను డెలిరీ చేస్తున్నట్టు వెల్లడించాడు. మిగతా రుణ వాయిదాల చెల్లింపులో హాల్డేకు ఏమైనా ఇబ్బంది కలిగితే తప్పకుండా తాము సహకరిస్తాం అని పోలీస్ అధికారి తెహజీబ్ ఖాజీ తెలిపారు.
Also Read :
మామిడి ప్రియులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఇక నుంచి ఇంటి వద్దకు పండ్లు..!
ఐదు నిమిషాల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన బాలయ్య.. ఎలా అంటే..!!