రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడ్ ఆయినూనె ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసినదే. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించేందుకు గాను హెచ్‌యూఎల్, యూనిలీవర్ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు నిత్యవసర వస్తువుల ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ధరల పెరుగుదల జాబితాలోకి బిస్కీట్లు కూడా వచ్చేసాయి. రాబోయే రోజుల్లో బిస్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement
భారత అతిపెద్ద బిస్కెట్ల తయారు దారి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ బిస్కెట్ల ధరలను 7 శాతం మేరకు పెంచాలని ప్రణాళిలకలను రచిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో తొలుత 3 శాతం మేర ధరల పెంపును సూచించగా.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ధరల పెంపును 8 నుంచి 9 శాతం మేర అభిప్రాయపడ్డారు. గత రెండేండ్లలో ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎప్పుడూ చూడలేదనిబ్రిటానియా కంపెనీ ఎం.డీ. వరుణ్ వెల్లడించారు. గత త్రైమాసికంలో బ్రిటానియా నికర ఆదాయంలో 19 శాతం తగ్గుదలను నమోదు చేసింది.
ముఖ్యంగా ఉక్రెయిన్ పై సైనికచర్య ప్రకటించినప్పటి నుంచి కార్మికుల కొరత, సప్లై చైన్ వంటి పరిమితులతో ఎఫ్ెంసీజీ కంపెనీలకు భారంగా మారింది. ఒత్తిళ్లను తగ్గించేందుకు ధరల పెంపు అనివార్యమైందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి. బ్రిటానియాతో పాటు ఇతర బిస్కెట్ కంపెనీలు కూడా ధరలను పెంచే అవకాశముందని తెలుస్తోంది. ధరలను పెంచే బదులుగా క్వాంటిటి తగ్గించి అమ్మకాలు జరపాలనే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.
Also Read : పరుచూరి వెంకేశ్వరరావు ఫోటో పై స్పందించిన గోపాలకృష్ణ.. ఏమన్నారంటే..?