సీనియర్ రచయిత, నటుడు, దర్శకుడు పరుచూరి వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఓ ఫోటో కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసినదే. అందులో ఆయనను గుర్తు పట్టడం కూడా చాలా కష్టంగా మారింది. అంతగా మారిపోయారు. దీంతో ఆయనకు అంతుపట్టని వ్యాధి ఏదో సోకిందంటూ రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ ఫోటో నెట్టింట్లో బాగానే చక్కర్లు కొట్టింది. దీనిపై ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానెల్ లో స్పందించారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశాడు.
Paruchuri venkateswara rao & paruchuri brothers
paruchuri-brothers
చాలా మంది అన్నయ్య ఫోటో చూసి మాట్లాడమన్నారు. ఆయన బాగానే ఉన్నారు. ఎంజీ రామచంద్రన్ కు ఓ కోరిక ఉండేది. ఆ కళ్ల జోడు, ఆటోపీ లేకుండా బయటకు కనిపించకూడదని అనుకునేవారు. అలాగేఊ శోభన్ బాబు కూడా అనుకునే వారు. ప్రేక్షకులు నన్ను ఎలా చూసి ఇష్టపడ్డారో అలాగే కనిపించాలని అనుకునేవారు. ప్రేక్షకులు నన్ను ఎలా చూసి ఇష్టపడ్డారో అలాగే కనిపించాలని అనుకునేవారు. ఏఎన్నార్ కూడా అలాగే అనుకునే వారు. కానీ మీనా నటించిన సీతారామయ్య మనవరాలు సినిమా కోసం విగ్ లేకుండా నటించారు. 90 ఏళ్ల వరకు ఆయన బాగానే జీవించారు.
ముఖ్యంగా అన్నయ్య గురించి చాలా మంది బాధపడుతున్నారు. ఆయన క్షేమంగానే ఉన్నారు. అన్ని పరీక్షలు చేయించుకున్నారు. 2017లో ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు తేడా కొట్టింది. అక్కడి నుంచి వచ్చాక పరీక్షలు చేయించుకున్నారు. ఆహార నియమాలు కొన్ని చెప్పారు. ఈ రెండేండ్ల కాలంలో బరువు తగ్గారు. నేను కూడా ఈ రెండేండ్లలో 10 కిలోల బరువు తగ్గాను. ఆయన మేధస్సు కూడా బాగానే పని చేస్తోంది. జయంత్‌కు కూడా చెప్పాను. అలాంటి ఫోటోను ఎందుకు పెట్టావని అన్నాను. అన్నయ్య అలా ఉన్నాడని మన కంటితో చూడవచ్చు కదా అన్నాను. ఒకతను 80 ఏళ్లు వస్తున్నాయ్ ఆ వయస్సులో ఎలా ఉంటారు. ఏమి మాట్లాడుతున్నారని పెట్టారు. అన్నయ్య బాగానే ఉన్నారని చెప్పాడు గోపాలకృష్ణ.