Home » కూరలో ఉప్పు ఎక్కువైందని పారేయద్దు.. ఇలా చెయ్యండి సరిపోతుంది..!

కూరలో ఉప్పు ఎక్కువైందని పారేయద్దు.. ఇలా చెయ్యండి సరిపోతుంది..!

by Sravya
Ad

ఒక్కొక్కసారి మనం కూరలో ఉప్పు వేసామో లేదో మర్చిపోయి రెండు సార్లు వేసేస్తూ ఉంటాము. లేదంటే ఏదో పరధ్యానంలో ఎక్కువ ఉప్పు వేసేస్తూ ఉంటాము. ఆహారంలో ఉప్పు సరిగా లేకపోతే ఆహారాన్ని తీసుకోలేము. ఉప్పు ఎక్కువ వున్నా తక్కువ వున్నా కూడా మనం తీసుకోవడానికి ఇష్టపడము. ఉప్పు తగ్గితే రుచి బాగోదు. ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము కాబట్టి ఉప్పుని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక్కొక్కసారి పరధ్యానంలో ఉప్పు ఎక్కువ వేసినట్లయితే దానిని పారేయకండి. అంతా బాగుండి ఉప్పు ఎక్కువైందని కూర పారేయలేము కదా..

Advertisement

Advertisement

కూరలో ఉప్పుని తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదు కూర లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఉడికించిన బంగాళదుంపని అందులో కలపండి. అందులో ఉప్పు అంతా కూడా బంగాళదుంప పీల్చుకుంటుంది. దీంతో ఉప్పు తగ్గుతుంది కూరలో ఉప్పు ఎక్కువైతే రెండు మూడు చెంచాల పెరుగు కూరలో కలపండి. రుచి బాగా పెరుగుతుంది ఉప్పు తగ్గుతుంది. కూరలో ఉప్పు ఎక్కువైనట్లయితే ఉల్లిపాయ టమాట ముద్ద చేసి అందులో వేసేయండి కూర లో ఉప్పు తగ్గుతుంది రుచి కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు ఇలా చేసి చూడండి.

Also read:

Visitors Are Also Reading